Weight Loss Diet: మరుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది బరువు పెరుగుతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే అరోగ్యంగా ఉంటూ..బరువును అదుపులో ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గే క్రమంలో పొటాషియం, పోషకాలుండే ఆహారం శరీరానికి చాలా అవసరమరని నిపుణులు పేర్కొన్నారు. శరీర దృఢత్వానికి  పొటాషియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  ఇది శరీరంలోని కొవ్వును తగ్గించడానికి కూడా తోడ్పడుతుంది. కాబట్టి పొటాషియం అధికంగా ఉండే ఆహారాల గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గాలంటే ఈ ఆహారాలు తీసుకోండి:


1.పాలకూర (Spinach)


ఆకు కూరలు, కాయగూరలు తింటే ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో బచ్చలికూర తినడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. బచ్చలికూరలో 837 మి.గ్రా పొటాషియం ఉంటుంది. అందుచేత పాలకూరను ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి.



2. చిలగడదుంప  (Sweet potato)


చిలగడదుంప అనేక పోషకాలుంటాయి. కావున దీనిని తినడడం వల్ల శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ఆహారంగా తీసుకుంటే బరువు తగ్గడానికి దోహదపడుతుంది.


3. అరటి (Banana)


అరటిపండులో పొటాషియం విలువలు అధికంగా ఉంటాయి.  ఇది ఏడాది పొడవునా లభించే ఏకైక పండు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర బరువును తగ్గించడాని సహాయపడుతుంది.


4. బీన్స్ (Beans)


బీన్స్‌లో పీచు, పొటాషియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నందున బరువు అదుపులో పెడుతుంది.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Curd Benefits On Hair: పెరుగు వల్ల జుట్టుకు ఇన్ని లాభాలా..!!


Also Read: Cooking Mistakes: వంట చేసే క్రమంలో ఈ సూత్రాలను పాటించండి..ఇవి అనారోగ్య బారిన పడకుండా కాపాడుతాయి.!! 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి