Kavya Maran Net Worth: షారుఖ్ ఖాన్‌ కంటే కావ్య పాపకే ఆస్తి ఎక్కువ..? వేల కోట్లకు ఏకైక వారసురాలు

Kavya Maran Business: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి.. కోల్‌కతా నైట్‌ రైడర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 ఛాంపియన్‌గా నిలిచింది. హైదరాబాద్‌ ఓడినా.. ఆ టీమ్ సీఈఓ కావ్యమారన్ ఈ సీజన్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. కావ్య మారన్ ఎవరు..? ఆమె ఆస్తుల విలువ ఎంత..? అని నెట్టింట భారీగా వెతుకుతున్నారు. 
 

1 /7

ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. ఆమె ఆస్తుల విలువ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కంటే ఎక్కువనే రూమర్లు వస్తున్నాయి.   

2 /7

కావ్య మారన్ మీడియా దిగ్గజం కళానిధి మారన్ కుమార్తె. ఆయన ప్రముఖ వ్యాపారవేత్త కాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు సహ యజమానిగా ఉన్నారు.   

3 /7

2018లో ఎస్‌ఆర్‌హెచ్ బాధ్యతలు తీసుకున్న కావ్య పాప.. టీమ్‌లో అన్నీ తానై చూసుకుంటున్నారు. జట్టు ఆడిన ప్రతీ మ్యాచ్‌కు స్టేడియానికి వెళ్లి ఉత్సాహ పరిచారు.  

4 /7

కావ్య మారన్ చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీ నుంచి పట్టభద్రులు అయ్యారు. ఇంగ్లండ్‌లోని వార్విక్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ కంప్లీట్ చేశారు.  

5 /7

NPT నివేదిక ప్రకారం.. కావ్య తండ్రి కళానిధి మారన్ నికర విలువ దాదాపు రూ.24 వేల కోట్లుగా ఉంది. ఈ ఆస్తులకు కావ్య మారన్ ఏకైక వారసులు. దీంతో ఈ ఆస్తి మొత్తం ఆమెకే చెందుతుంది.  

6 /7

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు నిర్మాణ సంస్థ, VFX స్టూడియోతో ఇతర వ్యాపారాలు ఉన్నాయి. ఆయన నికర సంపద రూ.6 వేల కోట్లుగా ఉంది.  

7 /7

ఈ లెక్కన షారూఖ్ ఖాన్ కంటే ఆస్తిలో కావ్య మారన్ ముందున్నారు. దేశంలోని బిలియనీర్ల జాబితాలో కళానిధి మారన్ 82వ స్థానంలో ఉన్నారు.