Weight Loss For Tinda: బేబీ గుమ్మడి కాయతో భారతీయులు చాలా రకాల ఆహార పదార్థాలు చేస్తారు. గుమ్మడి నోటికి రుచిని ఇవ్వడమే కాకుండా శరీరానికి శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే చాలా రకాల ఔషధ గుణాలున్నాయి. ఇందులో శరీరానికి కావాల్సిన యాంటీ-ఆక్సిడెంట్లు, ఫైబర్, కెరోటినాయిడ్స్, విటమిన్ సి, ఐరన్, పొటాషియం లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో వినియోగిస్తే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పొట్ట సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది. దీనిని క్రమంగా వినియోగిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బేబీ గుమ్మడి యొక్క ప్రయోజనాలు:
1. చాలా మంది ఆధునిక జీవన శైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది జీర్ణక్రియ సమస్యల బారిన పడుతున్నారు. అయితే పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి బేబీ గుమ్మడి ఆహరంలో వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా  పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


2. గుండె సమస్యలతో బాధపడుతున్నవారికి బేబీ గుమ్మడి ప్రభావవంతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే గుండె సమస్యలతో బాధపడుతున్నవారు గుమ్మడి రసం తాగడం వల్ల సులభంగా అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి.


3. ప్రస్తుతం చాలా మంది చెడు ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో విచ్చల విడిగా చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. అయితే ఈ కొవ్వును నియంత్రించడానికి క్రమం తప్పకుండా బేబీ గుమ్మడి ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గి.. బీపీ నార్మల్‌గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


 


Also Read: Amazon Smart tv offers: మీ ఇంటిని హోమ్ థియేటర్‌గా మార్చే స్మార్ట్‌టీవీ కేవలం 9 వేలే


Also Read: Amazon Smart tv offers: మీ ఇంటిని హోమ్ థియేటర్‌గా మార్చే స్మార్ట్‌టీవీ కేవలం 9 వేలే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook