Bottle Gourd Weight Loss: సొరకాయలో శరీరానికి కావాల్సిన చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో ఉండే విత్తనాలు కూడా శరీరానికి శక్తినిచ్చేందుకు సహాయపడతాయి. కాబట్టి వీటి యొక్క విత్తనాలను స్వీట్ల తయారీలోనూ.. ఆహార పదార్థాలను వినియోగిస్తారు. అయితే దీని విత్తనాల వల్ల కాకుండా సొరకాయ పైన ఉండే పొట్టు వల్ల కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. చాలామంది వీటిని వండుకునే క్రమంలో వీటిని ఉపయోగిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందులో ఉండే పోషకాలు:
సొరకాయ తొక్కలో ఫోలేట్, విటమిన్ సి విటమిన్లు బి వన్, బి1 బి3, బి5,  బి సి6 లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో క్యాల్షియం, ఐరన్, జింక్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి మూలకాలు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. 


జుట్టు సమస్యలకు చెక్:
ఆధునిక జీవన శైలి కారణంగా జుట్టు రాలడం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. అయితే దీనికోసం సొరకాయ తొక్కులను వినియోగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని మిక్సీలో గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే జుట్టు జుట్టు సమస్యలన్నీ దూరమవుతాయి.


పైల్స్ బాధపడుతున్నా రా..?:
పైల్స్ తో చాలామంది బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి సొరకాయ తొక్కులు ప్రభావంతంగా కృషి చేస్తాయి. ఈ తొక్కలను చిన్నగా కట్ చేసి ఫ్రైలా చేసుకుని ఆహారంలో భాగంగా తీసుకుంటే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 


బరువును తగ్గిస్తుంది:
సొరకాయ తొక్కలు ఫైబర్ అధిక పరిమాణంలో కాబట్టి వీటిని ఆహారంలో వినియోగిస్తే సులభంగా ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు. అంతేకాకుండా జీర్ణ క్రియ సమస్యలకు కూడా చెప్పేటోచని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ తొక్కలను జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. 


చర్మ సమస్యలు:
కాలుష్యం కారణంగా ప్రస్తుతం చాలామందిలో చర్మ సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి.. ఈ తొక్కలను ఫేస్ ప్యాక్ లో కూడా వినియోగించవచ్చు. ఈ సొరకాయ తొక్కులను గ్రైండర్లో వేసి మిశ్రమంలో తయారు చేసుకొని.. సమస్య ఉన్న ప్రదేశంపై అప్లై చేయాలి. ఇలా చేస్తే తొందర్లోనే ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.


Also Read: Dussehra 2022: దసరా రోజు ఆయుధ పూజలో భాగంగా ఇలా చేయండి.. మీరు కోరిన కోరికలు తీరుతాయి..


Also Read: Dussehra 2022: శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు.. దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 


Dussehra 2022Dussehra Pujan Vidhi 2022saraswati puja 2022