Weight Loss Diet: ఏం చేసిన బరువు తగ్గలేకపోతున్నారా.. ఇలా చేస్తే కేవలం 20 రోజుల్లో మీరు అనుకున్నంత తగ్గడం ఖాయం..
Weight Loss Diet: బరువు తగ్గే క్రమంలో కఠినతర వ్యాయామాల కంటే డైటీషియన్లు సూచించిన డైట్ ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చాలామంది బరువు తగ్గడానికి కట్టిన తర్వాత వ్యాయామాలు చేస్తున్నారు. దీంతో వారంతా అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
Weight Loss Diet: బరువు తగ్గే క్రమంలో కఠినతర వ్యాయామాల కంటే డైటీషియన్లు సూచించిన డైట్ ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చాలామంది బరువు తగ్గడానికి కట్టిన తర్వాత వ్యాయామాలు చేస్తున్నారు. దీంతో వారంతా అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఎలాంటి వ్యాయామాలు చేయకుండా కేవలం డైట్ ని పాటించి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ప్రముఖ డైటీషియన్లు చెబుతున్నారు. అయితే దీనికోసం కచ్చితంగా వారు సూచించిన ఫిస్ట్ డైట్, కీటో డైట్లను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటించడం వల్ల ఆరోగ్యంగా సులభంగా శరీర అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చని వారు చెబుతున్నారు.
ఫిస్ట్ డైట్ లో భాగంగా కొన్ని ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కేవలం కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్, ప్రోటీన్స్ అధిక పరిమాణంలో ఉన్న ఆహారాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ప్రతిరోజు 300 గ్రాముల నుంచి 700 గ్రాముల వరకు బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ డైట్ లో భాగంగా తప్పకుండా ఫ్రెష్ ఆహారాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్లే శరీరానికి మంచి పోషకాలు లభించి శరీరం దృఢంగా తయారవుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ మెరుగుపడి బరువు సులభంగా తగ్గుతారు. డైట్ ని పాటించేవారు చాక్లెట్స్ కల్తీ నూనెలతో చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
ఫిస్ట్ డైట్ చేసే క్రమంలో వ్యాయామాలు అవసరమా..?:
ఈ డైట్ చేసే క్రమంలో ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడమే కాకుండా.. వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ డైట్ ని పాటించేవారు ప్రతిరోజు ఒక గంట నుంచి రెండున్నర గంటలు దాకా వ్యాయామాలు చేయాలి. ఇలా పాటించడం వల్లే సులభంగా ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
బరువు తగ్గే క్రమంలో వీటిని అస్సలు తీసుకోవద్దు:
బరువు తగ్గే క్రమంలో చాలామంది కొన్ని రకాల తప్పులు చేస్తున్నారు. ముఖ్యంగా డైట్లను ఫాలో కాకుండా విచ్చలవిడిగా బయట లభించే అనారోగ్యకారమైన ఆహారాలను తీసుకుంటున్నారు. వీటివల్ల బరువు పెరగడమే కాకుండా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి