Weight Loss Tips: అతి తక్కువ కాలంలో ఎక్కువ బరువు తగ్గడానికి సులభమైన చిట్కా ఇదే..!
Weight Loss In 7 Days: ప్రస్తుతం చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికోసం రకరకాల డైట్ ప్లాన్లను అనుసరిస్తున్నారు. వీటి వల్ల చాలామంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడినట్టు సమాచారం.
Weight Loss In 7 Days: ప్రస్తుతం చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికోసం రకరకాల డైట్ ప్లాన్లను అనుసరిస్తున్నారు. వీటి వల్ల చాలామంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడినట్టు సమాచారం. ఆరోగ్యకరమైన ఆహారాలను, వ్యాయామాలు, మంచి డైట్ ప్లాన్ ను అనుసరించి.. బరువు తగ్గడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మధుమేహం గుండె సమస్యలు, ఊబకాయం పొట్టలో సమస్యలు, కొలెస్ట్రాల్ పెరగడం వంటి తీవ్ర సమస్యలకు గురి కావడానికి.. ప్రధాన కారణం కేవలం బరువు పెరగడమే.. అయితే ఈ పెరుగుతున్న బరువును హెల్తీగా తగ్గించుకోవడానికి నిపుణులు సూచించిన చిట్కాలను మాత్రమే అనుసరిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు.
దీనికోసం దినచర్యలో భాగంగా వ్యాయామాలు చేయడం.. ఉదయం పూట యోగాతో మంచి అల్పాహారాలు తీసుకోవడం వంటి నియమాలు పాటిస్తే సులభంగా హెల్తీగా బరువు తగ్గడం ఖాయం. ప్రస్తుతం చాలామంది బరువు తగ్గే క్రమంలో ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ఉత్తమం. దీనికోసం రాత్రుల్లో సరైన సమయాల్లో నిద్రపోతే.. ఒత్తిడి కంట్రోల్లో ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.
పురుషులతో పోలిస్తే స్త్రీలు సులభంగా బరువు తగ్గుతారు. స్త్రీలు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వల్ల పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల సులభంగా శరీర బరువును నియంత్రించవచ్చు. అయితే ఈ కింది చిట్కాలను పాటించడం వల్ల తక్కువ కాలంలోనే ఎక్కువ బరువును తగ్గించుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఆ చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. సమతుల్యమైన ఆహారం:
సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల డైట్ సక్రమంగా ఉంటుంది. కావున సులభంగా మీ శరీర బరువు నియంత్రించుకోవాలనుకుంటే ఆహారంలో తప్పనిసరిగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు సమూలంగా ఉండే ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లు వల్ల శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. ఇందులో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది కావున బరువు తగ్గే క్రమంలో ఇవి అధిక పరిమాణంలో ఉండే ఆహారాలను తీసుకోవడం శరీరానికి చాలా మంచిది.
2. ఫైబర్ తో కూడిన ఆహారాలు:
బరువు తగ్గడానికి వీటితో కూడిన ఆహారాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. బరువు తగ్గే క్రమంలో శరీరానికి ఫైబర్ గల ఆహారాలు చాలా అవసరం అవుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించి శరీర బరువును కూడా తగ్గిస్థాయి. అంతేకాకుండా జీర్ణ క్రియ వ్యవస్థను మెరుగుపరచడానికి దోహదపడతాయి. కాబట్టి ఇవి అధిక పరిమాణంలో ఉండే..కూరగాయలు, పండ్లు, చిక్కుళ్ళు, ఓట్స్, క్వినోవా వంటి తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.
3. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచండి:
బరువు తగ్గే క్రమంలో తప్పకుండా బాడీని హైడ్రేట్ గా ఉంచాలి. ఇలా ఉంచడం వల్లే టాక్సిన్స్ ప్రక్రియ సులభంగా జరుగుతుంది. అంతేకాకుండా కండరాలు, జీర్ణ క్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి ప్రతిరోజు కనీసం నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగాలి.
4. వీటినీ మాత్రమే తీసుకోవాలి:
బరువు తగ్గే క్రమంలో అనారోగ్యకరమైన ఆహార పదార్థాల జోలికి అసలు వెళ్ళకూడదు. శరీరానికి శక్తినిచ్చే..పాలు, బాదం పాలు, మజ్జిగ, కూరగాయల రసం, డిటాక్స్ వాటర్స్, గ్రీన్ టీ వంటి పానీయాలు మాత్రమే తీసుకోవాలి. ఇవి తీసుకునే క్రమంలో చక్కెర పరిమాణం అధికంగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే రక్తంలోని ఇన్సులిన్ పరిమాణాన్ని పెంచి చెడు కొలెస్ట్రాల్ కు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. వీటిని తీసుకునే క్రమంలో చక్కెర పరిమాణం తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Weight Loss Tips: ఆ నాలుగు అలవాట్లు మార్చుకుంటే..నెలలోనే బరువు తగ్గడం ఖాయం
Also Read: Weight Loss Tips: ఈ ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు 12 రోజుల్లో బరువు తగ్గుతారు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook