Weight Loss Remedy: ఉరుకులు పరుగుల బిజీ జీవితంలో జీవనశైలి, ఆహారపు అలవాట్లతో పాటు శారీరక శ్రమ లోపించడంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అన్నింటికీ మూల కారణం అధిక బరువు లేదా స్థూలకాయం. ఈ ఒక్క సమస్య ఇతర ప్రమాదకర సమస్యలకు కారణమౌతోంది. అయితే ఇంట్లో తయారు చేసుకునే ఓ డ్రింక్‌తో ఈ సమస్య నుంచి సులభంగా గట్టెక్కవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో మనం ఎదుర్కొనే చాలా అనారోగ్య సమస్యలకు పరిష్కారం ఉంది. ఏవి ఎందుకు ఉపయోగపడతాయో సరిగ్గా తెలుసుకుని వాడితే అంతకంటే ప్రయోజనం మరొకటి ఉండకపోవచ్చు. అందులో ఒకటి జీరా. జీలకర్ర. ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండేదే. ఇందులో ఉండే థైమోక్వినోన్ అనే పోషకంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. జీలకర్ర క్రమం తప్పకుండా వాడితే ఈ థైమోక్వినోన్ కారణంగా బెల్లీ ఫ్యాట్ వేగంగా తగ్గుతుంది. శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ అంతమౌతాయి. అంతేకాకుండా శరీరంలో విష పదార్ధాలు బయటకు తొలగిపోతాయి. అందుకే జీలకర్ర నీరు క్రమం తప్పకుండా వాడితే ఈ ప్రయోజనాలు కలుగుతాయి. బరువు కూడా గణనీయంగా తగ్గుతుంది. 
రెండు స్పూన్ల జీలకర్ర తీసుకోవాలి. ఓ గ్లాసు నీళ్లలో కలిపి ఉడికించాలి. ఆ తరువాత సాధారణ ఉష్ణోగ్రతకు చల్లబర్చాలి. రోజూ ఉదయం వేళ పరగడుపున తాగితే మంచి ఫలితాలుంటాయి.


జీలకర్ర నీటిలో పుష్కలంగా ఉండే ఫైబర్ కారణంగా శరీరంలో విష పదార్ధాలు పూర్తిగా బయటకు తొలగిపోతాయి. జీలకర్ర నీరు అనేది అత్యంత శక్తివంతమైన డీటాక్సిఫయర్‌లా పనిచేస్తుంది. శరీరం హైడ్రేట్‌గా ఉండేట్టు చేస్తుంది. ఎప్పటికీ ఫ్రెష్‌గా ఉంచుతుంది. తద్వారా బరువు తగ్గించడంలో కీలకంగా మారుతుంది.


జీర్ణక్రియ మెరుగుపర్చేందుకు


జీలకర్ర నీరు రోజూ తాగడం వల్ల శరీరంలో జీర్ణ వ్యవస్థ పటిష్టమౌతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దాంతో మలబద్ధకం, మార్నింగ్ సిక్నెస్, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు తగ్గుతాయి. స్తూలకాయం కారణంగా నిద్రలేమి సమస్య తలెత్తతుంది. ఎప్పుడైతే నిద్ర తక్కువైందో వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. జీలకర్ర నీటిని క్రమం తప్పకుండా తాగితే నిద్రలేమి సమస్య ఉండదు. 


జీలకర్ర నీరు రోజూ తాగడం వల్ల శరీరం అదనపు బరువు చాలా సులభంగా తగ్గుతుంది. పొట్ట, కడుపు, నడుము చుట్టూ ఉండే అదనపు కొవ్వు వేగంగా కరుగుతుంది. అయితే రోజూ పరగడుపున క్రమం తప్పకుండా కనీసం నెలరోజులు తాగాలి. అప్పుడే ఫలితం కన్పిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా శరీరంలో ఉండే విష పదార్ధాలు బయటకు సులభంగా తొలగించవచ్చు. అన్నింటికీ మించి జీలకర్ర నీరు రోజూ తాగడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇమ్యూనిటీ బలంగా ఉండేందుకు జీలకర్ర నీరు అద్భుతంగా ఉపయోగపడుతుంది. 


Also read: Dry Cough Remedies: పొడి దగ్గు వేధిస్తుంటే ఈ 5 చిట్కాలు ట్రై చేయండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.