Weight Loss Drinks: రోజూ రాత్రి వేళ ఈ డ్రింక్స్ తాగితే 4 వారాల్లో అధిక బరువుకు చెక్
Weight Loss Drinks: ఇటీవలి కాలంలో అధిక బరువు లేదా స్థూలకాయం ప్రధాన సమస్యగా మారిపోయింది. బరువు తగ్గించేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించి విఫలమవుతుంటారు. అయితే కొన్ని డ్రింక్స్ తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ లేదా కొవ్వు అత్యంత వేగంగా కరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Weight Loss Drinks: అధిక బరువు సమస్య నుంచి గట్టెక్కేందుకు గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్స్ చేయడం లేదా ఖరీదైన సర్జరీలు చేయించుకోవడం అవసరం లేదు. సరైన డైట్ తీసుకుంటే కొన్ని డ్రింక్స్ రాత్రి వేళ తీసుకుంటే వేగంగా బరువు తగ్గించుకోవచ్చు.
గ్రీన్ టీ. బరువు తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడే డ్రింక్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, కెటోచిన్స్ పెద్దమొత్తంలో ఉండటం వల్ల మెటబోలిజం వేగంగా వృద్ధి చెందుతుంది. ఫ్యాట్ కూడా వేగంగా కరుగుతుంది. రాత్రి వేళ పడుకునే ముందు గ్రీన్ టీ తాగి తే మంచి ఫలితాలు కన్పిస్తాయి. శరీరంలో ఉండే కొవ్వు వేగంగా కరుగుతుంది. మంచి నిద్ర కూడా పడుతుంది. రాత్రి సమయంలో పడుకునేటప్పుడు ఎనర్జీని నియంత్రిస్తుంది. వేళాపాళాలేని ఆకలిని తగ్గిస్తుంది.
వాము నీళ్లు రాత్రి వేళ తాగడం వల్ల శరీరంపై చాలా ప్రభావం పడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని రాత్రంతా హైడ్రేట్‌గా ఉంచుతుంది. రాత్రి వేళ ఆకలి వేయడం తగ్గుతుంది. అంతేకాకుండా డీటాక్స్ చేయడంలో అద్భుతంగా ఉపయోగడపడుతుంది. డీటాక్స్ ప్రక్రియలో శరీరంలోని వ్యర్ధాలు బయటకు తొలగిపోయి శరీరం తేలిగ్గా మారుతుంది. బరువు తగ్గించే ప్రక్రియలో ఇది కీలకం
వాము నీళ్లను ఉదయం పరగడుపున తీసుకోవడం కూడా మంచి విధానం. రాత్రంతా వామును నీళ్లలో నానబెట్టి ఉదయం వడకాచి తాగడం వల్ల మెటబోలిజం వేగమవుతుంది. జీర్ణక్రియ మెరుగుపడి బరువు తగ్గించేందుకు దోహదమవుతుంది.
లెమన్ వాటర్ మరో అద్భుతమైన ప్రత్యామ్నాయం. గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరంపై మంచి ప్రభావం పడుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దాంతో శరీరంలోని విష పదార్ధాలు బయటకు తొలగిపోతాయి. బాడీని హైడ్రేట్‌గా ఉంచుతుంది. బరువు తగ్గించే ప్రక్రియలో లెమన్ వాటర్ కీలకంగా ఉపయోగపడుతుంది.
Also readl: Fatty Liver Drinks: రోజూ ఉదయం ఈ 6 డ్రింక్స్ తాగితే ఫ్యాటీ లివర్ సమస్య మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook