Weight Loss Mistakes: బరువు తగ్గే క్రమంలో ఇలా చేస్తున్నారా.. అయితే మొదటికే మోసం..!
Weight Loss Mistakes: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారం తిసుకోవడం వల్ల, ఆహారంపై శ్రద్ధ వహించకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
Weight Loss Mistakes: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారం తిసుకోవడం వల్ల, ఆహారంపై శ్రద్ధ వహించకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే శరీర బరువును తగ్గించడం కోసం వివిధ రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు. కానీ బరువు తగ్గలేక పోతారు. అయితే ఈ బరువు తగ్గే క్రమంలో పలు నియమాలు పాటించడం లేదు. వీటి వల్ల బరువు తగ్గలేక పోతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కఠిన ఆహార నియమాలు పాటించిన చివరకు వాటిని గాలికి వదిలేస్తున్నారు. వీటి వల్ల బరువు తగ్గాలేకపోతున్నారు. క్రమంగా ఈ తప్పులు చేయడం వల్ల ఫలితం పొందలేకపోతున్నారు. అయితే ఆ తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సరిగ్గా నిద్ర పోక పోవడం(Not sleeping well):
బరువు తగ్గే క్రమంలో చాలా మంది అన్ని నియమాలు పాటించి చివరకు లేట్ నైట్ నిద్రపోతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీరు చేసిన వ్యాయామాలు ఫలితం వృధా అవుతుంది. అయితే బరువు తగ్గాలనుకునే వారు వ్యాయామాలు చేసిన తర్వాత 10 నుంచి 11 గంటల పాటు నిద్ర పోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు.
బాగా వ్యాయామం చేయడం(Havy exercise):
బరువును తగ్గించుకునే క్రమంలో వ్యాయామం చేయడం చాలా ఉత్తమం. కానీ అతిగా వ్యాయామం చేయడం(Havy exercise) వల్ల శరీర సమస్యలు వస్తాయి. ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గే క్రమంలో పరిమితికి మించి వ్యాయమం చేస్తూ ఉన్నారు. అయితే వీరు ఎలాంటి ఫలితాలను పొందలేకపోతున్నారని ఇటీవలే నివేదికలు పేర్కొన్నాయి. సరైన సమయంలో వ్యాయామం చేయడం.. ఆహారంపై శ్రద్ధ వహించడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
సరైన సమయంలో తినకపోవడం(Not eating at the right time):
మారుతున్న జీవన శైలికారణంగా చాలా మంది సరైన సమయంలో ఆహారాన్ని తీసుకోలేకపోన్నారు. చాలా మంది తినకపోవడం వల్ల బరువు తగ్గుతారని అనుకుంటారు. ఇలా చేయడం సరైనది కాదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గే క్రమంలో సరైన డైట్ ఫుడ్‌ను తీసుకోవాలి. అపుడే బరువు నియంత్రణలో ఉంటుంది.
నీరు తాగక పోవడం(Not drinking water):
చాలా మంది బరువు తగ్గే క్రమంలో వ్యాయామం చేసిన తర్వాత తగినంత నీరు తీసుకోలేక పోతున్నారు. దీని వల్ల కూడా శరీరం డీహైడ్రేషన్‌కు గురై పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. కావున వ్యాయావం చేసే క్రమంలో తప్పకుండా 1 నుంచి 2 లీటర్ల నీరు తాగాలని నిపుణులు పేర్కొన్నారు. నీటని అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ బలంగా అవ్వడమే కాకుండా కండరాల బలాన్ని కూడా పెంచుతుంది. కావును ఎవరైతే బరువుతు తగ్గాలని అనుకుంటున్నారో వారు తప్పకుండా నీటిని తాగాలి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.
Also Read: Monsoon Makeup Tips: వానలో తడవడం వల్ల మేకప్ పోతోందా.. అయితే ఇలా చేయండి..!
Also Read: Sun Transit effect: కర్కాటక రాశిలో సూర్య సంచారం... ఈ రాశివారికి డబ్బే డబ్బు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook