Weight Loss Tips: బరువు తగ్గడానికి జిమ్ లేదా వ్యాయామం చేసే క్రమంలో తప్పకుండా పోషకాలు ఉన్న మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్ల మీరు సులభంగా బరువు తగ్గొచ్చు.  ప్రస్తుతం చాలామంది బరువు తగ్గే క్రమంలో వివిధ రకాల డైట్లను అనుసరిస్తున్నారు. ఇందులో ఉండే ఆహారాలు చాలామందికి అనారోగ్యానికి గురి చేస్తున్నాయి. అయితే డైట్ పాటించే క్రమంలో తప్పకుండా పోషకాలు ఉన్న ఆహారాలను, విటమిన్లు ఉన్న స్నాక్స్ ను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా సులభంగా ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు. అయితే ఇదే క్రమంలో చాలామంది డైట్ లో భాగంగా వైట్ రైస్ ను ఆహారంగా తీసుకుంటున్నారు. ఇలా వైట్ రైస్ ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆహారం తీసుకునే క్రమంలో ఈ నియమాలు పాటించాలి:


పప్పులు తీసుకోవాలి:
భారతీయులు పప్పులను తరచుగా ఆహార పదార్థాలలో వినియోగిస్తారు. అయితే మంచి పోషకాలు ఉన్న పప్పులన్నీ తీసుకోవడం వల్ల శరీరానికి పోషకాలు అందడమే కాకుండా.. సంపూర్ణ ఆరోగ్యంతో బరువు తగ్గవచ్చనీ నిపుణులు తెలుపుతున్నారు.


వైట్ రైస్ ని కేవలం ఇలానే తినాలి:
బరువు తగ్గే క్రమంలో డైట్ను అనుసరించినట్లయితే.. వైట్ రైస్ ను కేవలం ఒకేసారి ఆహారంగా తీసుకోవాలి. ఇలా చేస్తేనే ఆరోగ్యంగా బరువు తగ్గగలుగుతారు. చాలామంది వైట్ రైస్ ను మూడు లేదా నాలుగు సార్లు ఆహారంగా తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల సులభంగా బరువు తగ్గలేకపోతున్నారు. క్రమంలో ఈ చిట్కా తప్పకుండా పాటించాలి.


కూరగలను ఇలా తీసుకోవాలి:
బరువు తగ్గడానికి సలాడ్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. సలాడ్స్ అధికంగా కూరగాయలను విని యోగిస్తారు. కాబట్టి బరువు తగ్గడానికి ఈ సలాడ్స్ తీసుకుంటే సులభంగా ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా దీనిని తీసుకోవాలి.


బరువు తగ్గే క్రమంలో వైట్ రైస్ ను తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రైస్ లో ఉండే మూలకాలు శరీరంలో కొవ్వు పరిమాణాలపై ప్రభావితం చెంది బరువు పెరగడం ఇతర సమస్యలకు దారి తీస్తాయి. కాబట్టి బరువు తగ్గే క్రమంలో వైట్ రైస్ తీసుకోకపోవడం చాలా మంచిదని నిపణులు అభిప్రాయపడుతున్నారు. వైట్ రైస్ కి బదులుగా బ్రౌన్ రైస్ ను రోజుకు ఒకసారి ఆహారంగా తీసుకోవచ్చు. పై నియమాలన్నీ తూ.. చా  పాటిస్తే సులభంగా బరువు తగ్గుతారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..


Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook