Weight Loss Tips: ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఎండాకాలంలో విముక్తి పొందడం చాలా సులభమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఊబకాయం నుంచి ఫిట్‌గా ఉండడానికి చాలా రకాల ఇంటి చిట్కాలు ఉన్నాయి. అంతేకాకుండా పలు రకాల ఆహారాలను అలవాటు చేసుకోవాలని వారు చెబుతున్నారు. ఈ ఆరోగ్యకరమైన ఆహారలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గించుకోవడానికి ఈ ఆహారం:


ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తినండి:


వేసవి కాలంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఫైబర్ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని వారు పేర్కొన్నారు. అందుకే స్ట్రాబెర్రీలు, రేగు పండ్లు, పుచ్చకాయలు మొదలైన వాటిని ఆహారంలో వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.  ఫిట్‌గా ఉండాలనుకుంటే 60 శాతం పండ్లను, ఆకుపచ్చ కూరగాయలను వినియోగించాలి. ఇలా చేయడం ద్వారా వేసవిలో త్వరగా బరువు తగ్గే అవకాశాలున్నాయి.


బాగా నడవండి:


వేసవి కాలంలో చాలా మంది వ్యాయమం చేయడం తగ్గిస్తారు. కాబట్టి సులభంగా బరువు పెరుగుతారు.  బరువు తగ్గాలనుకుంటే..వేసవి కాలంలో ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. అంతేకాకుండా ఉదయం పూట రోజూ 30 నుంచి 40 నిమిషాల పాటు నడవాలి.


గ్రీన్ టీ తాగండి:


గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. కావున శరీరంలో కేలరీలను తగ్గించడానికి ఎంతగానో దోహదపడుతుంది. బరువు తగ్గడానికి రోజుకు 2 నుంచి 3 సార్లు గ్రీన్ టీని తాగాలి.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Holding Poop: టాయ్‌లెట్‌ వస్తున్నా వెళ్లకుండా ఆపుకుంటున్నారా.. ఈ అనారోగ్య సమస్యలు తప్పవు..!


Also Read: Black Raisins: మీ డైలీ డైట్‌లో అవి చేర్చుకుంటే..వృద్ధాప్య ఛాయలు దరిదాపులకు రావు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.