Holding Poop: టాయ్‌లెట్‌ వస్తున్నా వెళ్లకుండా ఆపుకుంటున్నారా.. ఈ అనారోగ్య సమస్యలు తప్పవు..!

Holding Poop: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది మల విసర్జన సమస్యలతో బాధపడుతున్నారు. కొందరు నిపుణులు రోజు మూడుసార్లు టాయిలెట్‌కు వెళ్లమని చెబుతుంటే..మరికొందరైతే నాలుగు లేద మూడు రోజులకు ఒకటి, రెండు సార్లు పోవాలని సూచిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 8, 2022, 03:52 PM IST
  • టాయ్‌లెట్‌ వస్తున్నావెళ్లకుండా ఆపుకుంటున్నారా..
  • కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు
  • బోవెల్ క్యాన్సర్, మూల వ్యాధులు వచ్చే అవకాశం
Holding Poop: టాయ్‌లెట్‌ వస్తున్నా వెళ్లకుండా ఆపుకుంటున్నారా.. ఈ అనారోగ్య సమస్యలు తప్పవు..!

Holding Poop: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది మల విసర్జన సమస్యలతో బాధపడుతున్నారు. కొందరు నిపుణులు రోజు మూడుసార్లు టాయిలెట్‌కు వెళ్లమని చెబుతుంటే..మరికొందరైతే నాలుగు లేద మూడు రోజులకు ఒకటి, రెండు సార్లు పోవాలని సూచిస్తున్నారు. ఇది మానవుని సహజమైన ప్రక్రియ కనుక..ఈ ప్రశ్నలకు నిజమైన సమాధానలు లేవు. అందుకే ఇది సహజమైన పద్ధతుల్లో జరిగితేనే సులభంగా ఉంటుంది.

ప్రస్తుతం చాలా మంది టాయిలెట్‌కు వెళ్లకుండా బిగపట్టుకుని ఉంటారు. ఇలా చేయడం ప్రమాదకరమని..ఇది ఆనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయని అరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రమాదకరమైన బోవెల్ క్యాన్సర్, మూల వ్యాధి, పేగుల్లో చిన్నచిన్న రంధ్రాల వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు. కాబట్టి టాయిలెట్ వచ్చినప్పుడు తప్పకుండా వెళ్లాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

20వ శతాబ్దంలో మల విసర్జనపై చాలా మంది నిపుణులు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో భాగంగా గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అనే ప్రక్రియను కనుగొన్నారు. అంతేకాకుండా మార్నింగ్ తిన్న టిఫిన్‌ శరీరంలోని పేగుల్లో వేగంగా ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు.

కడుపులో ఉన్న మలాన్ని శుభ్రం చేసుకోవాలని మెదడుకు పలు రకాల సంకేతాలు పంపినప్పుడు చిన్న పిల్లలు ఆటోమేటిక్‌గా విసర్జన చేసుకుంటారని ఈ పరిశోధనల్లో పేర్కొన్నారు. మల విసర్జన క్రమం తప్పకుండా జరగపోవడానికి చాలా కారణాలుంటాయి. అవేంటో తెలుసుకుందాం..

- మలబద్ధకం
- కడుపునొప్పి
- మల విసర్జనలో క్రమశిక్షణ పాటించకపోవడం
- కడుపులో వాపు
- కడుపులో గ్యాస్ సమస్యలు
- కడుపులో వేగంగా ఆహారం కదలకపోవడం

వచ్చే సమస్యలు ఇవే:

1. మలం బయటకి విసర్జన చేయకపోతే పేగుల్లో రసాయనాలు ఏర్పడి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి
2. మలబద్ధకాన్ని తగ్గించడానికి తృణధాన్యాలు తీసుకోవాలి.
3. కడుపులోని బాక్టీరియా బయటకు రావడం వల్ల మలబద్ధక సమస్యలు వస్తాయి.

Also Read: Best Dry Fruits: శరీరంలోని కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచే డ్రై ఫ్రూట్స్ ఇవే..!!

Also Read: Urad Dal Side Effects: అతిగా మినపప్పు తింటున్నారా..అయితే ప్రమాదమే..!!

Trending News