Weight Loss With Multigrain Bread: ప్రస్తుతం బరువు పెరగడం చాలా మందిలో పెద్ద సమస్యగా మారింది. బరువును నియంత్రించుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారు ఎలాంటి ఫలితాలు పొందలేక పోతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఇంటి చిట్కాలను పాటించాలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే కొందరిలో ఈ సమస్యలు ప్రాణాంతకంగాను మారుతున్నాయి. శరీరం చెడు కొలెస్ట్రాల్‌ పరిమాణం పెరిగి గుండె సమస్యలు, పొట్టలో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా ఉన్నామని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ సమస్యల కారణంగా చాలా మందిలో  మధుమేహం, గుండె సమస్యలు ఎదురవుతున్నాయని నివేదికలు తెలపడం విశేషం. అయితే బరువు నియంత్రించుకోవడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటి పై సమస్యలకు దారీ తీసే అవకాశాలున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది ఉదయం పూట టిఫిన్‌లో అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారు. ముఖ్యంగా బ్రెడ్ లాంటి ఐటమ్స్‌ను అధిక పరిమాణంలో తీసుకోవడం విశేషం. అయితే వీటికి దూరంగా ఉండాలని తరచుగా చెబుతూ ఉంటారు. కానీ ఉదయం పూట మంచి పోషకాలున్న బ్రెడ్‌లు తీసుకోవడం వల్ల కూడా బరువు నియంత్రించుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. వీటిలో ఉండే మూలకాలు శరీరాన్ని దృఢంగా చేయడమే కాకుండా శరీరారికి మంచి పోషకాలను అందిస్తాయి.


వైట్ బ్రెడ్‌ను అస్సలు తీసుకొవద్దు:


వైట్ బ్రెడ్‌ శరీరానికి హాని చేసే వివిధ రకాల మూలకాలు ఉన్నందున.. వీటిని ఉదయం పూట ఆహారంగా తీసుకోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.  వైట్ బ్రెడ్‌లో ఉండే పిండిపదార్థాలు రక్తంలో చెక్కర పరిమాణాలను పెంచే ఛాన్స్‌ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు అధికమని నిపుణులు పేర్కొన్నారు.


బరువు తగ్గడానికి ఎలాంటి బ్రెడ్స్‌ను తీసుకోవాలి:


బరువును నియంత్రించాలనుకునే వారు బ్రేక్‌ఫాస్ట్‌లో తృణధాన్యాలతో చేసిన బ్రెడ్స్‌ తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ఉదయం పూట తీసుకోవడం వల్ల శరీరంలో  ఫైబర్‌ పరిమాణం పెరిగే అవకాశాలున్నాయి. కావున దీని వల్ల శరీరంలో పోషకాహార లోపం తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫైబర్-రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల  బరువు సులభంగా నియంత్రించుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


బరువును నియంత్రించేందుకు ఓట్స్‌ బ్రెడ్:


 ఓట్స్‌ బ్రెడ్ బరువును నియంత్రించేందుకు చాలా సహాయపడుతుంది. ఇందులో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ బి1, ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పీచు పదార్థం బ్లడ్‌లోని షుగర్ లెవల్స్‌ను నియంత్రించి.. అధిక రక్తపోటును నివారిస్తుంది. ఇదే క్రమంలో బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also read:ITR Filing: రికార్డు స్థాయిలో ఐటీఆర్ దాఖలు..మరోసారి గడువు పెంచబోతున్నారా..?


Also read:Sourav Ganguly: గంగూలీ అభిమానులకు గుడ్‌న్యూస్..బ్యాట్ పట్టనున్న దాదా..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook