Lunula About Your Health: మనం శరీరంలోని కొన్ని భాగాల వల్ల అనారోగ్య సమస్యలను తెలుసుకొని పరిష్కరించవచ్చని ఆరోగ్యని నిపుణులు చెబుతున్నారు. అందులో చేతి గోర్ల పై ఉండే తెల్ల‌టి మ‌చ్చ‌లు ఒక‌టి. ఈ తెల్ల‌టి మ‌చ్చ‌ల‌ను లునూలా అని పిలుస్తారు వైద్యులు. ఇవి చాలా సున్నితమైన భాగాలు అని చెబుతారు నిపుణులు. ఏదైన కారణం వల్ల ఈ మచ్చ దెబ్బతింటే గోర్లు పెరగడం చాలా కష్టమని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ లునూలా గురించి కొన్ని అద్భుతమైన విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ లునూలా పెరిగే తీరు, రంగును  బట్టి మ‌న శ‌రీరంలో ఉండే అనారోగ్య స‌మ‌స్య‌ల గురించి కూడా తెలుసుకోవ‌చ్చని ఓ పరిశోధనలో తేలింది. అయితే ఈ లునూలా ఆకారం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో మనం తెలుసుకుందాం.


ఒకవేళ ఈ లునూలా బొటన వేలుపై కనిపించకపోతే ర‌క్త‌హీన‌త‌, డిఫ్రెష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలియజేస్తుంది.
 
 లునూలా బ్లూ  లేదా పూర్తిగా తెలుపు రంగులో పాలిపోయి ఉంటే డ‌యాబెటిస్ రాబోతుందని అర్థం చేసుకోవాలి. 


ఒక‌వేళ లునూలాపై ఎర్ర‌టి మ‌చ్చ‌లు ఉంటే గుండె సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని తెలుసుకోవాలి.


Also Read: Morning Sickness Remedies: గర్భిణీ స్త్రీలు మార్నింగ్ సిక్నెస్ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చు


లునూలా ఆకారం మ‌రీ గుర్తు ప‌ట్ట‌లేన‌ట్టుగా ఉంటే అజీర్తి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలియజేస్తుంది.


లునూలా ప‌సుపు రంగులో మారితే యాంటీ బ‌యాటిక్ , మందులు ఎక్కువగా తీసుకున్నట్టు చెబుతుంది.


శ‌రీరంలో మ‌లినాలు, విష ప‌దార్థాలు పేరుకుపోతే లునూలా ఆకారం చిన్న‌గా మారుతుంది. 


ఈ విధంగా మన చేతిపై ఉండే లునూలాను గ‌మ‌నించి మన శరీరంలో వచ్చే మార్పులను తెలుసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు


Also Read: Amla Health Magic: ఆమ్లా హెల్త్ మ్యాజిక్.. ఉసిరి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter