Banana Remedies in Telugu: అందుకే అరటి పండుని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఇందులో అద్భుతమైన పోషకాలున్నాయి. ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఆయుర్వేదం ప్రకారమే కాదు..ఆధునిక వైద్య శాస్త్రం ప్రకారం కూడా అరటి పండు డైట్‌లో తప్పకుండా ఉండాల్సిందే. శరీర నిర్మాణం, ఎదుగుదల, ఆరోగ్యానికి కావల్సిన అన్ని పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరటి పండు రోజూ క్రమం తప్పకుండా 40-50 రోజులు తింటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా 3 అానారోగ్య సమస్యలకు చెక్ చెప్పవచ్చు. మలబద్ధకం నియంత్రించేందుకు, నోటి పూత నిర్మూలన, మహిళల సమస్యలకు అద్భుతంగా పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం, విటమిన్ బి6, ఫైబర్ పెద్దఎత్తున ఉంటాయి. ఫలితంగా బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యానికి సైతం చాలా మంచిది. రోజూ క్రమం తప్పకుండా తినడం వల్ల చాలా తీవ్రమైన సమస్యలకు చెక్ చెప్పవచ్చు. 


చాలామంది మహిళల్లో బలహీనత లేదా ఇతర కారణాలతో ల్యూకోరియా అంటే వైట్ డిశ్చార్జ్ సమస్య ఉంటుంది. ఈ సమస్య ఉన్న మహిళలకు రోజూ ఉదయం అరటి పండుని పటిక బెల్లం పౌడర్‌తో కలిపి తింటే బలహీనత దూరమవడమే కాకుండా వైట్ డిశ్చార్జ్ సమస్య తగ్గుతుంది. 


కొంతమంది సన్నగా, పీలగా గాలికి పడిపోయేలా ఉంటారు. ఎంత ప్రయత్నించినా హెల్తీ వెయిట్ ఉండదు. అలాంటివారికి అరటి పండు బెస్ట్ సోర్స్. రోజూ బ్రేక్ పాస్ట్‌లో 1-2 అరటి పండ్లను నెయ్యితో కలిపి తింటే మంచి ఫలితాలుంటాయి. ఇలా కనీసం 40 రోజులు పాటిస్తే కచ్తితంగా బరువు పెరుగుతారు. పరిమితికి మించి తింటే మాత్రం విపరీతంగా బరువు పెరుగుతారు. అధిక బరువు ఇతర అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. 


చాలామందికి విటమిన్ బి లోపం మరే ఇతర కారణాలతో నోట్లో తరచూ పూత లేదా అల్సర్ వస్తుంటుంది. తరచూ విరేచనాల సమస్య ఉండవచ్చు. ఈ పరిస్థితుల్లో పెరుగుతో అరటి పండ్లు కలిపి తింటే మంచి ఫలితాలు కన్పిస్తాయి. నోటి పూత ఇతర సమస్యల్నికట్టడి చేయవచ్చు.


Also read: School Holidays 2024: ఇవాళ నవంబర్ 20 నుంచి ఈ రాష్ట్రాల్లో స్కూళ్లకు నిరవధిక సెలవులు, ఎక్కడెక్కడంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.