Muscle Cramps Pain: నిత్యం ఒత్తిడి, పోటీ ప్రపంచంతో పరుగులు, వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా మజిల్ క్రాంప్స్ నొప్పులు సాధారణమయ్యాయి. అసలీ మజిల్ క్రాంప్స్ అంటే ఏంటి, ఎలా ఉపశమనం పొందాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిత్య జీవితంలో రకరకాల ఆందోళనలు, ఒత్తిళ్లు సహజమే. అయితే ఆధునిక జీవన శైలి తీసుకొస్తున్న మార్పులతో ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. రోజువారీ జీవన విధానం మారిపోతోంది. ఫలితంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రధానంగా కన్పించేది ఇటీవలి కాలంలో ఎక్కువగా విన్పిస్తున్నది మజిల్ క్రాంప్స్. తరచూ పిక్కలు, తొడ కండరాలు, ఛాతీ కండరాలు బిగుసుకుపోతుంటాయి. ఫలితంగా తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. తొడలు, పిక్కల్లో అయితే భరించలేని నొప్పే ఉంటుంది. ఈ సమస్యనే వైద్య పరిభాషలో మజిల్ క్రాంప్స్‌గా పరిగణిస్తుంటారు. 


మజిల్ క్రాంప్స్ పెయిన్ అంటే ఏంటి, ఎందుకొస్తుంది


టీనేజ్ యువతలో ఎక్కువగా తొడ, పిక్కల్లో విపరీతమైన నొప్పి వస్తుంటుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవన శైలి. ఇందులో ప్రధానంగా నిద్ర సరిగ్గా లేకపోవడం, ఆహారంలో పోషక పదార్ధాలు లోపించడం, శరీరానికి అవసరమైన లవణాలు, ద్రవాలు తీసుకోకపోవడం, అలసట కారణంగా ఈ సమస్య తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం, ఫాస్పేట్ పరిమాణం తగ్గితే మజిల్ క్రాంప్స్ వస్తుంటాయి. శారీరక శ్రమ ఎక్కువైనా ఇదే సమస్య వస్తుంది. ఛాతీ భాగంలో కూడా తీవ్రమైన నొప్పి రావడం, ఊపిరి తీసుకుంటుంటే నొప్పి కన్పించడం ఇటీవల తరచూ ఎదురవుతున్న సమస్య.


ఉపశమనం కోసం ఏం చేయాలి


రోజూ క్రమం తప్పకుండా కాస్త ఉప్పు కలుపుకుని మజ్జిగ తీసుకోవాలి. వేసవిలో అయితే క్రమం తప్పకుండా బార్లీ తాగాలి. రోజుకు 7-8 గ్లాసుల నీరు తప్పకుండా తీసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా మజ్జిగ తీసుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అటు షుగర్ లేకుండా పండ్ల రసాలు, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. తీసుకునే ఆహార పదార్ధాల్లో పోషకాలు ఉండేట్టు చూసుకోవాలి. రోజుకు 7-8 గంటల నిద్ర కచ్చితంగా ఉండాలి. ఇలా చేయడం ద్వారా తరచూ ఎదురయ్యే ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చంటున్నారు వైద్య నిపుణులు. మజిల్ క్రాంప్ పెయన్ ఛాతీ భాగంలో తరచూ వస్తుంటుంది. ఆందోళన చెందకుండా వైద్యుడిని సంప్రదిస్తే సరిపోతుంది. 


Also read: Buttermilk Side Effects: ఈ సమస్యలుంటే మజ్డిగను దూరం పెట్టేయాల్సిందే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook