Prediabetes Reversal tips: ప్రీ డయాబెటిస్ అంటే ఏంటి, రివర్సల్ చేయగలమా లేదా
Prediabetes Reversal tips: దేశంలోనే కాదు ప్రపంచమంతా మధుమేహం వ్యాధి పెద్దఎత్తున వ్యాపిస్తోంది. ఇప్పటి వరకూ డయాబెటిస్‌కు నియంత్రణే తప్ప పూర్తి చికిత్స లేదు. ఈ వ్యాధిని ఎంత సులభంగా నియంత్రించవచ్చో నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రమాదకరం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Prediabetes Reversal tips: డయాబెటిస్ వ్యాధి సంక్రమించే ముందు కొన్ని కన్పిస్తుంటాయి. ముఖ్యంగా ప్రీ డయాబెటిస్ రూపంలో హెచ్చరిక పంపిస్తుంది. ఈ సమయంలో అప్రమత్తం కాకపోతే పరిస్థితి గంభీరమౌతుంది. కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా ప్రీ డయాబెటిస్‌ను రివర్సల్ చేయవచ్చంటున్నారు వైద్యులు. ఆ వివరాలు మీ కోసం.
దేశంలో ప్రతి నలుగురిలో ఇద్దరికి డయాబెటిస్ ఉంటోంది. అయినా చాలామంది దీనిని తేలిగ్గా తీసుకుంటారు. ప్రీ డయాబెటిస్ రూపంలో ఉన్నప్పుడే అప్రమత్తం కావల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండా పరిస్థితి గంభీరమయ్యేవరకూ చోద్యం చూస్తుంటారు. ప్రీ డయాబెటిస్ అంటే సాధారణం కంటే కొద్దిగా ఎక్కువ అంతే. శరీరంలో ఇన్సులిన్ నిరోధకత మొదలవుతుంది ఈ స్థితిలో. ఈ స్థితిలో జాగ్రత్తగా ఉంటే ప్రారంభదశలోనే డయాబెటిస్‌కు అడ్డుకట్ట వేయవచ్చు. ప్రీ డయాబెటిస్ స్థితిలో ఉంటే ఏడాదిలోగా టైప్ 2 డయాబెటిస్‌గా మారేందుకు 10 శాతం అవకాశముంటుందని హార్వర్డ్ పరిశోధన చెబుతోంది. జీవితకాలంలో టైప్ 2 డయాబెటిస్ సంక్రమించేందుకు 70 శాతం అవకాశముంటుంది. అందుకే వీటి లక్షణాల గురించి అప్రమత్తంగా ఉండాలి.
ప్రీ డయాబెటిస్ ఉంటే దాహం ఎక్కువగా వేయడం, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం ఉంటుంది. అంతేకాకుండా అకారణంగా అలసట ఉంటుంది. శరీరంలో ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం వల్ల ఎనర్జీ తగ్గిపోతుంది. బరువు పెరుగుతుంది. చర్మంపై మార్పు కన్పిస్తుంది. మెడ భాగంలో, చంకలో నల్లటి మచ్చలు కన్పిస్తాయి. కొందరిలో అయితే దృష్టి మసకబారుతుంది. ఆకలి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పరిస్థితిని రివర్స్ పద్ధతి ద్వారా తగ్గించవచ్చు లేదా నిర్మూలించవచ్చు.
దీనికోసం డైట్ సమతుల్యంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, లీన్ ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్ తీసుకోవాలి. ప్రోసెస్డ్ ఫుడ్ , షుగర్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. వారంలో కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఇందులో బ్రిస్క్ వాక్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఏరోబిక్స్ వంటివి ఉండవచ్చు. శరీర బరువు కనీసం 5-10 శాతం తగ్గించడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపర్చవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించవచ్చు.
ఇక అన్నింటికంటే ముఖ్యంగా రాత్రి నిద్ర 7-9 గంటలు కచ్చితంగా ప్రశాంతంగా ఉండాలి. నిద్ర సరిగ్గా లేకుంటే శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇక ఒత్తిడి, ఆందోళన లేకుండా ఉండాలి. దీనికోసం యోగా, ధ్యానం, శ్వాస ప్రక్రియ వంటివి అలవర్చుకోవాలి. ఈ పద్ధతులు క్రమం తప్పకుండా పాటిస్తే ప్రీ డయాబెటిస్ ను రివర్సల్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఎప్పుడైతే ప్రీ డయాబెటిస్ రివర్సల్ చేయగలమో డయాబెటిస్ ముప్పు తగ్గించినట్టే.
Also read: Dates and Ghee Benefits: నెయ్యిలో ఖర్జూరం నానబెట్టి తింటే ఏమౌతుందో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.