Shigella Bacteria: ఫుడ్ పాయిజన్ అనేది సర్వ సాధారణంగా జరిగేదే. షవర్మ తిన్న తరువాత ఓ అమ్మాయి మరణించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఫుడ్ పాయిజన్‌కు కారణమైన షిగెల్లా ఇన్‌ఫెక్షన్ అంటే ఏమిటి, ఎందుకొస్తుందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేరళ వైద్య ఆరోగ్య శాఖ మే 3వ తేదీన షిగెల్లా బ్యాక్టీరియాను కనుగొంది. రాష్ట్రంలోని కాసరగోడ్‌లో ఓ 16 ఏళ్ల బాలిక షవర్మా తిని ఫుడ్ పాయిజన్‌కు గురైంది. సీరియస్ కావడంతో ఆమెతో సహా మరో 30 మందిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ 16 ఏళ్ల బాలిక మాత్రం మరణించింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. 


షవర్మా తినడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వైద్యాధికారులు నిర్ధారించారు. పాయిజన్‌గా మారిన ఫుడ్‌లో షిగెల్లా బ్యాక్టీరియా ఉందని తెలుసుకున్నారు. పోలీసులు ఆ షవర్మా యజమానితో పాటు సిబ్బందిని అరెస్టు చేశారు. షవర్మా సెంటర్‌ను సీజ్ చేశారు. ఫుడ్ పాయిజన్ అనేది సాధారణంగా తరచూ జరిగేదే. అయితే షిగెల్లా బ్యాక్టీరియా ఎంతవరకూ ప్రమాదకరం, లక్షణాలెలా ఉంటాయి, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలనేది తెలుసుకుందాం...


షిగెల్లా అంటే ఏంటి


షిగెల్లా బ్యాక్టీరియా అనేది ఎంటెరోబ్యాక్టర్ కుటుంబానికి చెందింది. ఇంటెస్టైన్‌లో గ్రూప్ ఆఫ్ బ్యాక్టిరియా ఉంటుంది. ఇది అందరిలో వ్యాధులకు కారణమవదు. ఇది ప్రధానంగా ఇంటెస్టైన్ వ్యవస్థను దెబ్బతీసి..విరేచనాలకు కారణమౌతుంది. కొన్ని సందర్భాల్లో భరించలేని కడుపు నొప్పి, జ్వరం కూడా వస్తుంది. ఈ ఇన్‌ఫెక్షన్ అనేది చాలా సులభంగా వ్యాపిస్తుంది. కానీ కొంత బ్యాక్టీరియానే రుగ్మతకు కారణంగా మారుతుందని యూఎస్‌కు చెందిన డిసిజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ తెలిపింది. ఈ ఇన్‌ఫెక్షన్ సాధారణంగా ఆహారం, నీళ్లలో పుడుతుందని..కంటామినేటెడ్ ఫుడ్ తినడం వల్ల సమస్యగా మారుతుందని సీడీసీ వెల్లడించింది. 


ప్రతి వందమందిలో ఒకరికి మాత్రమే


ఈ వ్యాధి సంబంధిత రోగితో నేరుగా గానీ లేదా పరోక్షంగా గానీ సంబంధంతో సులభంగా వ్యాపిస్తుంది. కంటామినేటెడ్ వాటర్ తాగినా లేదా ఆ నీళ్లలో ఈత కొట్టినా సరే ఈ ఇన్‌ఫెక్షన్ సోకుతుంది. అయితే షిగెల్లా అనేది సర్వ సాధారణమైన ఇన్‌ఫెక్షన్ కాదు. ప్రతి వంద ఫుడ్ పాయిజన్ లేదా విరేచనాల కేసుల్లో ఒకరికి మాత్రమే షిగెల్లా బ్యాక్టిరియా సోకుతుంది. రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి త్వరగా సోకుతుంది. అదే సమయంలో గర్భిణీ స్త్రీలు ఈ ఇన్‌ఫెక్షన్‌తో జాగ్రత్తగా ఉండాలి. 


షిగెల్లా ఎన్ని రకాలు


షిగెల్లా బ్యాక్టీరియా నాలుగు రకాలు. షిగెల్లా సోన్నీ, షిగెల్లా ఫ్లెక్స్‌నెరి, షిగెల్లా బాయ్ది, షిగెల్లా డిసెంటరీ. ఈ నాలుగు రకాలు విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. అందుకే ఇవి చాలా ప్రమాదకరం. ఈ ఇన్‌ఫెక్షన్ అనేది రోగ నిరోధక శక్తి పూర్తిగా బలహీనంగా ఉంటే తప్ప..రోగికి ప్రాణహాని కల్గించదు. ఇది పూర్తిగా చికిత్స చేయించతగిన పరిస్థితే. ఆసుపత్రిలో చేర్చి..ఐవీ, యాంటీ బయోటిక్స్ ద్వారా వైద్యం చేయవచ్చు.


Also read; Sabja Seeds Rose Milk: వేసవిలో చల్లదనంతో పాటు..బరువు తగ్గేందుకు అద్భుత డ్రింక్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook