Mutton vs Chicken vs Fish: మటన్, చికెన్, చేపల్లో ఏది మంచిది, ఏది ప్రమాదకరం, కారణాలేంటి
Which Non Veg Food is Better: ప్రపంచవ్యాప్తంగా రెండు రకాల ఆహారం ఉంటుంది. శాకాహారం, మాంసాహారం. రెండింట్లోనూ ఆప్షన్లు ఎక్కువే. శాకాహారంతో పోలిస్తే మాంసాహారం ఆరోగ్యపరంగా అంత మంచిది కాదంటారు. మరి నాన్‌వెజ్ లేకపోతే ఉండలేనివాళ్లు ఏం చేయాలి..ఆ వివరాలు మీ కోసం.
Which Non Veg Food is Better: మాంసాహారంలో ఆప్షన్లు చాలా ఉన్నాయి. చికెన్, మటన్, ఫిష్, క్రాబ్స్, ప్రాన్స్, బీఫ్ ఇలా చాలా ఉన్నాయి. ఈ అన్ని ఆప్షన్లలో ఎక్కువగా తినేది చికెన్, మటన్, ఫిష్. అయితే చాలామందికి ఈ మూడింట్లో ఏది బెస్ట్ అనే విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. మటన్ వర్సెస్ చికెన్ వర్సెస్ ఫిష్..ఏది బెటర్ అనేది తప్పకుండా తెలుసుకోవల్సిన అవసరముంది.
మాంసాహారం గురించి చర్చించేటప్పుడు రెడ్ మీట్, వైట్ మీట్ గురించి తెలుసుకోవాలి. రెడ్ మీట్ అంటే మటన్, పోర్క్, బీఫ్ వంటి జంతువుల మాంసం. అదే వైట్ మీట్ అంటే పక్షులు, చేపలు, రొయ్యలు, పీతలు వస్తాయి. రెడ్ మీట్‌లో ప్రోటీన్లతో పాటు ఫ్యాట్ ఉంటుంది. కానీ వైట్ మీట్‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మరి ఈ క్రమంలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిదనేది తెలుసుకోవాలి. ఈ మూడింటినీ పోల్చి చూస్తే మటన్ కాస్త ప్రమాదకరం. మటన్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య రావచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవచ్చు. ఇక మటన్ కంటే బెస్ట్ చికెన్ అని చెప్పాలి. మటన్‌తో పోలిస్తే చికెన్ వల్ల నష్టాలు తక్కువ. ఇందులో ప్రోటీన్లు, కేలరీలు ఎక్కువ. కొలెస్ట్రాల్ రిస్క్ తక్కువ ఉంటుంది.
కానీ కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల చికెన్ తినడం వల్ల బరువు పెరగవచ్చు. అందుకే మటన్, చికెన్ ఎక్కువగా తినడం వల్ల కొవ్వు పేరుకుని గుండె సంబంధిత వ్యాధులు ఉత్పన్నమౌతాయి. రక్త నాళాలు మూసుకుపోవచ్చు.
అయితే చేపలతో ఆ ప్రమాదం లేదు. ఇవి వైట్ మీట్ పరిధిలో వస్తాయి. ఇందులో ప్రోటీన్లు ఎక్కువ. ఫ్యాట్ ఉండదు. దాంతోపాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చేపల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె వ్యాధుల్ని తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. నాన్ వెజ్‌లో సీ ఫుడ్స్ చాలా మంచిదని పలు అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. చేపలు తినడం వల్ల రక్తపోటు, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ సమస్యలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. చేపల్లో ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు కంటి ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్ ఎ ఉంటుంది.
Also read: Cancer Symptoms: మీలో ఈ లక్షణాలున్నాయా, అయితే జాగ్రత్త కేన్సర్ ముప్పు ఉన్నట్టే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.