Kids Health: పిల్లల ఎదుగుదలకు అవసరమైన ఆహారాలు ఏంటి? వీటిని తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది
Healthy Food For Kids: పిల్లలకు ఆరోగ్యకరమైన పోషకాహారం అందించడం వల్ల వారు ఎలాంటి అనారోగ్య సమస్య బారిన పడకుండా ఉంటారు. వారి ఎదుగుదల కూడా ఎంతో మెరుగుగా ఉంటుంది. ఆరోగ్యనిపుణులు ప్రకారం వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఈ మార్పులన్నీ వస్తూనే ఉంటాయి. ఈ సమయంలో పోషకాలు కలిగిన పదార్థాలు ఇవ్వడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
Healthy Food For Kids: పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఇవాల్సి ఉంటుంది. పిల్లలు పెరుగుతున్నప్పుడు శరీరంలో హార్మోన్లలో మార్పులు, కండరాలు, ఎముకలు బలంగా తయారు అవుతాయి. ఈ సమయంలో సరైన ఆహారం అందించడం వల్ల వారు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. అయితే ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి అనే ప్రశ్న కలుగుతుంది. ముఖ్యంగా తీసుకోవాల్సి ఆహారపదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం..
ఆకుకూరలు:
పెరుగుతన్న పిల్లలకు పోషక ఆహారం అందించడం చాలా అవసరం. దీని వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. అయితే పచ్చి ఆకు కూరలు వారికి ఇవ్వడం వల్ల విటమిన్లు, మినరల్స్ పిల్లల మెదడు అభివృద్ధికి కూడా సహాయపడతాయి.
గింజలు:
పిల్లల ఎదుగుదలకు గింజలు ఎంతో అవసరమని ఆరోగ్యనిపుణులు చెబుతుంటారు. ఇందులో లభించే పోషకాలు పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. చియా, అవిసె గింజలు, నువ్వులను పిల్లలకు ఇవ్వడం వల్ల ఎముకలు దృఢంగా తయారు అవుతాయి.
పాల ఉత్పత్తులు:
పాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఎముకలు దృఢంగా తయారు అవుతాయి. పాలతో పాటు పాలు, జున్ను, పెరుగును వారికి ఇవ్వడం వల్ల శరీరం ఆరోగ్యంగా తయారు అవుతుంది.
డ్రై ఫ్రూట్స్:
ప్రతిరోజు పిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల వాటిలో లభించే పోషకాలు పిల్లలు ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల ఎముకలు, మెదడు పనితీరు, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
Also Read Motions: డయేరియా సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేయడం వల్ల సమస్యకు చెక్ !
పండ్లు:
సీజన్‌లో లభించే పండ్లు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ప్రతి సీజన్‌లో లభించే ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. దీని వల్ల శరీరం దృఢంగా తయారు అవుతుంది.
ఈ విధంగా పిల్లలకు పోషక ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారు. వారి ఎదుగుదల కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పదార్ఠాలు ప్రతిరోజు తీసుకోవడం ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తుంది.
Also Read Beauty tips: రోజూ క్రమం తప్పకుండా ఇలా చేస్తే 50 ఏళ్లయినా నిత్య యౌవనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter