Vitamin E: మనిషి శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు అవసరమైనట్టే..విటమిన్ ఇ కూడా అవసరమే. విటమిన్ ఇ లోపిస్తే ఆరోగ్య సమస్లు చాలా తలెత్తుతాయి. అందుకే తినే ఆహారంలో విటమిన్ ఇ ఉండేట్టు చూసుకోవాలి.  పదార్ధాలేంటి, విటమిన్ ఇ ఎందుకు అవసరమో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెరుగైన ఆరోగ్యానికి పోషక పదార్ధాలు, విటమిన్స్, ఖనిజ లవణాలు చాలా అవసరం. అందుకే విటమిన్ ఇ అన్నింటికంటే ప్రధానం. విటమిన్ ఇ తక్కువైతే ఆ రెండు సమస్యలు వెంటాడుతాయి. ఒకటి చర్మ సంబంధిత వ్యాధులు. రెండవది కంటి చూపు సమస్య. మనిషి శరీరం మెకానిజంను బలోపేతం చేయడంలో ఈ విటమిన్ చాలా దోహదపడుతుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. యూవీ కిరణాల నుంచి చర్మాన్ని సంరక్షించేది విటమిన్ ఇ మాత్రమే. అందుకే దైనందిన ఆహారంలో తప్పకుండా విటమిన్ ఇ ఉండేట్టు చూసుకోవాలి. 


విటమిన్ ఇ సమృద్ధిగా లభించే ఆహార పదార్ధాలు


మొదటిది బాదం. ఇందులో అధిక స్థాయిలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని రక్షిస్తుంది. అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఇందులో ఉంటాయి. మరోవైపు బాదంలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, కాపర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇక రెండవది హాజెల్ నట్స్. సెల్ డ్యామేజ్ నుంచి నూటికి నూరుశాతం రక్షణ అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండి మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. హాజెల్ నట్స్‌లో ఉండే డైటరీ ఫైబర్ బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. 


మూడవది అవకాడో. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే పండు. శరీరానికి కావలసిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది. విటమిన్లు, ప్రొటీన్లు, ఫైబర్ అన్నీ ఉంటాయి. రోజుకు ఒక అవోకాడో తింటే చాలు శరీరానికి అవసరమైన మొత్తంలో విటమిన్ ఇ లభిస్తుంది. నాలుగవది పొద్దు తిరుగుడు విత్తనాలు. కాల్చిన పొద్దు తిరుగుడు నూనె గింజలలో 75 శాతం కంటే ఎక్కువ విటమిన్ ఇ ఉంటుంది. 


ఇక ఐదవది సన్ ఫ్లవర్ ఆయిల్. బియ్యం ఊక, గోధుమ జెర్మ్, ఆలివ్, పొద్దుతిరుగుడు, సోయాబీన్, మొక్కజొన్న నూనె మొదలైన కూరగాయల నూనెల్లో కూడా విటమిన్ ఇ సమృద్ధిగా లభిస్తుంది. అన్ని కూరగాయల నూనెలు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. 


Also read: Healthy Heart Foods: రోజూ రెండు డ్రై ఫ్రూట్స్ తింటే చాలు..గుండెపోటు దూరం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.