Healthy Heart Foods: రోజూ రెండు డ్రై ఫ్రూట్స్ తింటే చాలు..గుండెపోటు దూరం

Healthy Heart Foods: ఆహారపు అలవాట్లతో గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే ఆహార పదార్ధాల్ని ఎంచుకోవల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఆ రెండు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు దూరమౌతాయని అంటున్నారని వైద్య నిపుణులు

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 10, 2022, 08:13 PM IST
Healthy Heart Foods: రోజూ రెండు డ్రై ఫ్రూట్స్ తింటే చాలు..గుండెపోటు దూరం

Healthy Heart Foods: ఆహారపు అలవాట్లతో గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే ఆహార పదార్ధాల్ని ఎంచుకోవల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఆ రెండు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు దూరమౌతాయని అంటున్నారని వైద్య నిపుణులు

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా మంచిది. గుండె సంబంధిత వ్యాధులు రోజురోజుకూ ఎక్కువవుతున్న నేపధ్యంలో ఇది చాలా అవసరం. కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని ఆహారంలో  చేర్చుకోవడం ద్వారా గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే ప్రోటీన్స్, కొవ్వు పదార్ధాలు, విటమిన్లు, ఖనిజ పదార్ధాలు ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. అయితే డ్రై ఫ్రూట్స్ ఎప్పుడూ మితంగా తీసుకోవాలి. అలా తీసుకుంటే శరీరంలో ఎల్‌డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్త నాళాల్లో పేరుకుపోకుండా డ్రై ఫ్రూట్స్ నియంత్రిస్తాయి. ఫలితంగా రక్తం గడ్డకట్టకుండా ఉండి..హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

కొన్ని రకాల డ్రైఫ్రూట్స్‌లో ఉండే ఎమినా యాసిడ్స్ రక్తనాళాల్ని వ్యాకోచించేలా చేసి..బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా బాదంలో ఉండే ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియంలు బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని నియంత్రిస్తాయి. స్థూలకాయం కూడా తగ్గుతుంది. రెండవది వాల్‌నట్స్. ఇందులో పుష్కలంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్‌ను నియంత్రిస్తాయి. రోజుకు రెండు వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల హార్ట్‌లో బ్లాక్స్ ఏర్పడవని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

పిస్తాలో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడమే కాకుండా..గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. ఇక జీడిపప్పులో ఉండే ఆలివ్ యాసిడ్ గుండెను పూర్తి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే కాపర్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పోషకాల కారణంగా గుండె పటిష్టంగా ఉంటుంది. ఇక చివరిది వేరు శెనగలు. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీనికితోడు కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. వారానికి రెండుసార్లు వేరుశెనగ తింటే..గుండెపోటు ముప్పు 15 శాతం తగ్గుతుందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. 

Also read: Belly Fat: పొట్ట చుట్టూ కొవ్వు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ పని చేయండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News