BP Warnings and Signs: ఇటీవలి కాలంలో ఎదురౌతున్న ప్రధాన అనారోగ్య సమస్య అధిక రక్తపోటు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కాగలదు. ఒక్కోసారి నిద్రలో కూడా రక్తపోటు అమాంతంగా పెరిగిపోతుంటుంది. అలాంటప్పుడు ప్రాణాలు పోతాయా, అసలేం జరుగుతుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజమే మరి రక్తపోటు అంతటి ప్రాణాంతక సమస్య. నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలు హరించేస్తుంది. ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా రక్తపోటు సమస్య తలెత్తుతుంటుంది. రక్తపోటును ఎప్పటికప్పుడు నియంత్రించకుంటే గుండెపోటు వ్యాధులైన హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటివి ఎదురౌతాయి. అందుకే రక్తపోటును సైలెంట్ కిల్లర్‌గా అభివర్ణిస్తుంటారు. రక్తపోటు అనేది కేవలం గుండెపైనే కాకుండా కిడ్నీలపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుంటుంది. ఆహారపు అలవాట్లను నియంత్రించకుంటే రక్తపోటు అదుపు తప్పుతుంది. ముఖ్యంగా జంక్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్, పికిల్స్ ఫ్రైడ్ పదార్ధాలకు దూరంగా ఉండాలి. వంటల్లో ఉప్పు వాడకపోవడం మంచిది. లేదా పరిమితంగా వాడాలి. 


రక్తపోటు పెరగడం వల్ల చాలా ప్రతికూల పరిణామాలు ఎదురౌతాయి, ముఖ్యంగా కంటి చూపు తగ్గడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం జరుగుతుంది. శరీరంలో రక్తపోటు పెరిగిందో లేదో కొన్ని సంకేతాల ఆధారంగా తెలుసుకోవచ్చు. రాత్రిపూట గురక పెట్టేవారిలో రక్తపోటు అధికంగా ఉండవచ్చు. ఇక నిద్రలేమి కూడా అధిక రక్తపోటుకు కారణం కావచ్చు. రక్తపోటు అధికంగా ఉంటే నిద్రకు ఆటంకం కలుగుతుంది. ప్రశాంతమైన నిద్ర కరువౌతుంది. ఈ సమస్యకు కారణం ఆధునిక జీవనశైలి మాత్రమే. అంటే ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం, పని ఒత్తిడి, సమయానికి తిండి తినకపోవడం వంటివి.


ఇక గురక అనేది ఓ తీవ్రమైన అసౌకర్యం. గురక ఎక్కువగా ఉంటే శ్వాస ప్రక్రియలో కూడా ఆటంకం కలగవచ్చు. రాత్రి వేళ గురకను కేవలం స్లీప్ అప్నియాగానే తీసుకోకుండా అధిక రక్తపోటుకు సంకేతంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రక్తనాళాల్లో ఆటంకం ఏర్పడినప్పుడు కూడా ఇది సంభవించవచ్చు. అదే జరిగితే ప్రాణాంతకం కాగలదు. అంటే రాత్రి నిద్రపోయేటప్పుడు బీపీ పెరిగిందంటే ప్రాణాలు పోయే ప్రమాదం లేకపోలేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. 


కొంతమందికి రాత్రి వేళ తరచూ మూత్రం వస్తుంటుంది. ఎక్కువసార్లు మూత్రానికి వెళ్తున్నారంటే అధిక రక్తపోటు కావచ్చు. బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు కిడ్నీలపై ఒత్తిడి పెరిగి మూత్రం తరచూ వస్తూ ఉంటుంది. కొంతమందికి రాత్రివేళ నిద్ర లేచినా లేదా హఠాత్తుగా నిద్ర లేచినా తలనొప్పి విపరీతంగా ఉంటుంది. ఇది పక్కాగా అధిక రక్తపోటు కారణంగా సంభవించే సమస్య. ఈ సమస్యను తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే రక్తపోటు అనేది ఎప్పుడు ప్రాణాలు తీస్తుందో ఎవరికీ తెలియదు. 


Also read: Asafoetida Benefits: వంటలకు రుచితో పాటు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook