Winter care foods Easy Breakfast 5 minute Winter Special Dahi Poha Recipe: చలికాలంలో ఉదయమే లేవాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది. లేచాక బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకునే ఓపిక ఉండదు. దీంతో చాలా మంది వింటర్‌‌లో బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేస్తుంటారు. కానీ ఉదయం తినకుండా ఉండడం వల్ల చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోకపోతే బరువు పెరగడం, మధుమేహం, ప్రేగుల సంబంధిత సమస్యలతో పాటు అనేక ఆరోగ్య సమస్యల బారినపడే అవకాశం ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే సింపుల్‌గా ఈ వింటర్‌‌లో (Winter‌‌) మంచి పోషకాలున్న బ్రేక్‌ఫాస్ట్‌ను తయారు చేసుకోండి. రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వంటకం.. వింటర్-స్పెషల్ దహీ పోహా. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు. కేవలం 5 నిమిషాల్లోనే ఈ వింటర్-స్పెషల్ దహీ పోహాను (Winter Special Dahi Poha Recipe) తయారు చేసుకోవచ్చు. ఈ బ్రేక్‌ఫాస్ట్ హెల్దీనెస్ ఇస్తుంది. అలాగే ఈ శీతాకాలానికి సరైన వంటకం. పెరుగు, నీళ్లలో.. పోహాను (Poha) కలిపి తయారు చేసే ఫుడ్ ఇది. ఇది ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది.


Also Read : Rahul Dravid on Kohli: కెప్టెన్ విరాట్ కోహ్లీపై కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు.. అతడొక అద్భుతమని కితాబు


దహీ పోహా రెసిపీ


మొదట పోహాను కడగండి. తర్వాత కాస్త పెరుగు తీసుకోండి. తగినన్ని నీళ్లను కూడా తీసుకోండి. ఈ రెండిండిటిని కలిపి ఒక పాత్రలో పోయండి. అందులో కడిగిన పోహాను వేయండి. ఈ మిక్స్‌లో కొన్ని డ్రై ఫ్రూట్స్ (Dry Fruits) లేదా యాపిల్స్‌ను కలుపుకోవచ్చు. ఇలా సులభంగా దహీ పోహా రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇది తయారు చేసుకోవడం చాలా సులువు. అలాగే హెల్దీ ఫుడ్ (Food) కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.


Also Read : Mohan babu: 'సినీ పరిశ్రమలో అందరూ సమానమే.. కలిసి సినిమాని బతికిద్దాం'


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook