వర్షాకాలం మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. సీజన్ మారుతుండటంతో జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉంది. చలికాలంలో ఈ సమస్యల్నించి ఎలా గట్టెక్కడం. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చలికాలం వచ్చిందంటే చాలు గజగజ వణికించే చలితో పాటు దగ్గు, జలుబు, జ్వరం వంటి ఇన్‌ఫెక్షన్లు వెంటాడుతాయి. ఇమ్యూనిటీ బలహీనంగా ఉంటే వెంటనే ఎటాక్ చేస్తాయి. శరీరంలో అంతర్గత ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. దీనికోసం వేడి చేసే వస్తువులు తీసుకోవడం తప్పనిసరి. ఇన్‌ఫెక్షన్ చిన్నారులు, వృద్ధులు అందర్నీ వెంటాడుతుంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆయుర్వేదంలో లభించే త్రికూట చూర్ణం దీనికి సరైన సమాధానం. 


త్రికూట చూర్ణం ప్రయోజనాలు


త్రికూట చూర్ణం తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు దూరమౌతాయి. దగ్గు, కఫం వంటి సమస్యల్నించి ఉపశమనం లభిస్తుంది. ఈ చూర్ణం మీ శరీరంలోని జీర్ణక్రియ శక్తిని పెంచుతుంది. శరీరంలో వేడి పెంచుతుంది. మరోవైపు ఇమ్యూనిటీని పెంచుతుంది. సీజనల్ వ్యాధుల్నించి సంరక్షిస్తుంది.


త్రికూట చూర్ణం ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు


త్రికూట చూర్ణాన్ని సొంతంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మార్కెట్‌కు వెళ్లి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. దీనికోసం సొంఠి, రావి చెట్టు ఆకులు, నల్ల మిరియాలు అవసరమౌతాయి. ఈ మూడింటిని సమాన మోతాదులో కలిపి పౌడర్‌గా చేసుకోవాలి. రావి ఆకులు, నల్ల మిరియాలు కొద్దిగా తక్కువే ఉండటం మంచిది. ఈ పౌడర్‌ను తేనె, నీళ్లతో కలిపి తీసుకోవాలి.


Also read: Chia Seeds: 30 రోజుల్లో అధిక బరువుకు చెక్, డయాబెటిస్ మాయం, మహిళలకు మరింత అందం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook