Winter Foods To Control Cholesterol Levels: కొలెస్ట్రాల్ రెండు రకాలు. అందులో ఒకటి లో-డెన్సిటీ లైపోప్రొటీన్ అంటారు. దీనినే ఎల్‌డిఎల్ అని కూడా పిలుస్తారు. ఇక మరొకటి హై-డెన్సిటీ లైపోప్రొటీన్. దీన్ని హెచ్‌డిఎల్ అని అంటారు. మనం తీసుకునే ఆహారాన్నిబట్టి ఈ రెండు కొలెస్ట్రాల్ లెవెల్స్ మారుతూ ఉంటాయి. శరీరానికి గుడ్ కొలెస్ట్రాల్ మేలు చేస్తే.. బ్యాడ్ కొలెస్ట్రాల్ హానీ చేస్తుంది. గుడ్లు, పాలు, నెయ్యి లాంటి ఆహార పదార్థాల్లో గుడ్ కొలెస్ట్రాల్ సమృద్ధిగా ఉంటుంది. రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్, నిల్వ చేసిన మాంసం, వేపిన మాంసంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఏ ఆహారం మన ఆరోగ్యానికి మేలు చేస్తుందో అది తీసుకుని.. హాని చేసే ఆహార పదార్థాలకు దూరంగా ఉన్నంత వరకు మీ ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉండి మీ ఆరోగ్యాన్ని కూడా అదే విధంగా కంట్రోల్లో పెడతాయి. లేదంటే అనారోగ్యం బారినపడి అవస్తలు పడేలా చేస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా పండ్లు, కూరగాయల్లో ఉండే ఫైబర్ కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని అదుపు తప్పకుండా ఉపయోగపడుతుంది. మరి వింటర్ సీజన్‌లో ఏయే ఫ్రూట్స్ తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.


యాపిల్: 
యాపిల్ పండులో ఉండే ఫైబర్ గుణాలు గుండెకు మేలు చేస్తాయి. అన్నింటికిమించి యాపిల్ పండులో ఉండే పాలిఫినాల్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని అదుపులో ఉంచడానికి సహాయపడతాయి.


అరటి పండు:
అరటిపండులో ఉండే పొటాషియం, ఫైబర్ కంటెంట్స్ బ్లడ్ ప్రెషర్‌ని కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుతాయి. అరటి పండులో ఉండే సాల్యుబుల్ ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.


దానిమ్మ పండు:
దానిమ్మ పండు రసంలో పాలిఫినాల్స్ యాంటీఆక్సిడెంట్స్‌లా పనిచేస్తాయి. ఏ ఇతర పండ్లలో లేనంత అధిక స్థాయిలో యాక్సిడెంట్స్ ఈ దానిమ్మ పండులో లభిస్తాయి. అందుకే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.


కాలీఫ్లవర్:
పండ్లతో పాటు కాలీఫ్లవర్ లాంటి కూరగాయలు కూడా వింటర్ సీజన్‌లో ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ సి, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ కె అనారోగ్యం దరిచేరకుండా ఉపయోగపడతాయి. 


టమాటలు:
కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించి అనారోగ్యం దరిచేరకుండా ఉండటంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఎంతో మేలు చేస్తాయి.


క్యారట్స్:
క్యారట్స్‌లో ఉండే సాల్యుబుల్ ఫైబర్, సాల్యుబుల్ విటమిన్స్, మినెరల్స్, ఆంటీయాక్సిడెంట్స్ బ్లడ్‌లో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గిస్తాయి. క్యారట్స్‌లో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపర్చడంతో పాటు గుండెకు సైతం మేలు చేస్తుంది.


ఇది కూడా చదవండి : Cholesterol Myths And Facts: కొలెస్ట్రాల్ ఎలా కంట్రోల్ చేయాలి ? ఏది నిజం, ఏది అపోహ


ఇది కూడా చదవండి : Health Tips: చలికాలంలో ఈ మూడు పదార్ధాలు డైట్‌లో ఉంటే..ఏ వ్యాధీ దరిచేరదు


ఇది కూడా చదవండి : Liver Failure Symptoms: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే లివర్ సమస్య ఉన్నట్లే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook