చలికాలంలో మీ గుండె పనితీరుపై ఒత్తిడి పెరుగుతుందని మీకు తెలుసా. వేసవిలో కంటే చలికాలంలో అందుకే గుండె వ్యాధులు ముప్పు అందుకే అథికంగా ఉంటుంది. ఎందుకీ పరిస్థితి, కారణాలేంటి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచేందుకు గుండెపై అధిక శ్రమ పడుతుంది. రక్తాన్ని అదే పనిగా పంపిస్తుండాలి. చలికాలంలో రక్త వాహికలు కుంచించుకుపోవడం వల్ల రక్త సరఫరా మెరుగ్గా ఉండేందుకు గుండె ఎక్కువ శ్రమ పడుతుంటుంది. 


గుండెపోటు ఎందుకొస్తుంది


గుండెపోటు అనేది గుండెకు రక్తం అందకపోయినా లేదా ఆటంకం ఏర్పడినా వస్తుంటుంది. గుండె ధమనుల్లోంచి ఒకదానిలో ఇబ్బంది లేదా ధమనుల్లో కొవ్వు, లేదా ప్లాక్ పేరుకుపోయుండటం వల్ల రక్త వాహికలకు బ్లాక్ అవుతుంటాయి. ఫలితంగా బ్లడ్‌క్లాట్స్ ఏర్పడుతుంటాయి.ఇవి ధమనుల్ని బ్లాక్ చేయడం వల్ల గుండెపోటు ఉత్పన్నమౌతుంది. 


చలికాలంలో గుండెపోటు ముప్పు అధికం


చలికాలంలో గుండెపోటు కేసులు పెరుగుతుంటాయి. ఎందుకంటే చలి కారణంగా చాలామంది పని తగ్గించేస్తారు. దాంతో స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్, కార్డియోవాస్క్యులర్ ఇబ్బందులు, ఎరిథ్‌మియా  వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. దాంతోపాటు చలికాలంలో రక్త వాహికలు కుదించుకుపోవడం వల్ల అంటే vasoconstriction కారణంగా రక్త నాళాలకు హాని కలుగుతుంది. హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతుంది.


చలికాలంలో గుండె సంరక్షణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు


1. చలికాలంలో శరీరాన్ని సాధ్యమైనంతవరకూ వేడిగా ఉంచాలి. గుండె పదిలంగా ఉండేందుకు ఇది మంచి పద్ధతి


2. మీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటే..మద్యమధ్యలో బ్రేక్ తీసుకోవాలి.


3. నీళ్లు ఎక్కువగా తాగాలి. దీంతో శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. డీహైడ్రేషన్ అనేది హార్ట్ బీట్‌ను పెంచేస్తుంది.


4. గుండెపోటు లక్షణాలపై శ్రద్ధ పెట్టాలి. ఎప్పటికప్పుడు గుండె ఆరోగ్యంపై పరీక్షించుకోవాలి.


Also read: Kidney Care Tips: మీ తుదిశ్వాస వరకూ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 అలవాట్లు కీలకం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook