Kidney Care Tips: మీ తుదిశ్వాస వరకూ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 అలవాట్లు కీలకం

మీరు జీవిత చరమాంకం వరకూ అంటే వృద్ధాప్యం వరకూ కిడ్నీల్ని ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే మీ దైనందిక జీవన విధానం మారాల్సి ఉంటుంది. ఇది పెద్ద కష్టమైంది కాదు. ఇవాళే ఈ 5 మార్పులు చేస్తే చాలు. కిడ్నీ సంబంధిత వ్యాధులు దూరమౌతాయి.

Kidney Care Tips: మీరు జీవిత చరమాంకం వరకూ అంటే వృద్ధాప్యం వరకూ కిడ్నీల్ని ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే మీ దైనందిక జీవన విధానం మారాల్సి ఉంటుంది. ఇది పెద్ద కష్టమైంది కాదు. ఇవాళే ఈ 5 మార్పులు చేస్తే చాలు. కిడ్నీ సంబంధిత వ్యాధులు దూరమౌతాయి.

1 /5

నో పెయిన్ కిల్లర్స్ మీరు మీ కిడ్నీల్ని దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే పెయిన్ కిల్లర్ మందుల వాడకం మానేయాలి. దాంతోపాటు ఐబ్రూఫెన్, యాస్పిరిన్, నెప్రోక్సెన్ సోడియం సాల్ట్ వంటి మందుల్ని దూరం పెట్టాలి. ఈ మందులు మీ కిడ్నీలకు హాని కల్గిస్తాయి.

2 /5

ఫైబర్ ఆహార పదార్ధాలు మీరు మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే..మీ డైట్‌లో కూరలు, పండ్లు, తృణధాన్యాలు చేర్చాల్సి ఉంటుంది. ఈ పదార్ధాలు గుండె వ్యాధులు, అధిక రక్తపోటు, స్థూలకాయం నుంచి మిమ్మల్ని సంరక్షిస్తాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

3 /5

రోజూ వ్యాయామం దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కనీసం అరగంట వ్యాయామం చేయాల్సి ఉంటుంది. వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. నిర్ణీత పద్ధతిలో క్రమం తప్పకుండా చేసే వ్యాయామం మిమ్మల్ని దీర్ఘకాలిక వ్యాధుల్నించి కాపాడుతుంది.

4 /5

నీళ్లు తాగడం శరీరంలో ఎప్పుడూ తగిన మోతాదులో నీళ్లు ఉండాలి. దీనివల్ల మీరు హైడ్రేట్‌గా ఉండటమే కాకుండా..శరీరంలోని విషపదార్ధాలు బయటకు తొలగిపోతాయి. ఈ విష పదార్ధాలు మీ బాడీలో రాళ్లరూపంలో మారవచ్చు.

5 /5

రక్తపోటు, మధుమేహంపై ప్రత్యేక శ్రద్ధ రక్తపోటు, మధుమేహం రెండూ కిడ్నీల్ని ప్రభావితం చేస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయి అధికంగా ఉన్నా లేదా రక్తపోటు పెరిగినా కిడ్నీ పనితీరుపై ప్రభావం పడుతుంది. కిడ్నీ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.