Strong Bone Food: ఎముకలు పటిష్టంగా ఉండాలంటే కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు అవసరమౌతాయి. హెల్తీ ఫుడ్ తీసుకోకపోతే ఎముకల సమస్య వెంటాడుతుంది. 30 ఏళ్ల వయస్సుకే ఆ సమస్య వచ్చి పడుతుంది. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన మహిళలు ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎముకల సంబంధిత వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే 30 ఏళ్లు దాటగానే మహిళలు జాగ్రత్తగా ఉండాలి. కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా ఎముకల్ని పటిష్టంగా ఉంచవచ్చు. డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 30 ఏళ్లు దాటిన మహిళలు ఈ 5 రకాల ఫుడ్స్ అస్సలు వదలకూడదు. 


పాలు, పాల ఉత్పత్తులను మహిళలు తప్పకుండా తీసుకోవాలి. పాలు, పెరుగు, పన్నీరు, మజ్జిగలో కాల్షియం పెద్దమొత్తంలో ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ డి కూడా పుష్కలంగా లబిస్తుంది. శరీరంలో కాల్షియం సంగ్రహణకు ఇది తోడ్పడుతుంది. డైట్‌లో రోజూ కనీసం రెండు పాల ఉత్పత్తులు ఉండేట్టు చూసుకోవాలి. 


ఇక మహిళలు డైట్‌లో తప్పకుండా తీసుకోవల్సిన మరో ఆహారం ఆకు కూరలు. పాలకూర, తోటకూర, మెంతికూర వంటి వాటిలో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. దాంతోపాటు ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కే కావల్సినంత పరిమాణంలో ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. 


సోయా బీన్‌లో ప్రోటీన్, కాల్షియం కావల్సినంతగా ఉంటుంది. ఎముకలు పటిష్టంగా ఉండేందుకు సోయా బీన్ అద్భుతంగా పనిచేస్తాయి. పప్పుల్లో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. డైట్ లో పెసర, రాజ్మా, శెనగలు తప్పకుండా ఉండాలి. సూప్, పప్పులు లేదా సలాడ్ డైట్‌లో తప్పకుండా ఉండాలి


నువ్వులు కూడా మహిళలకు చాలా మంచిది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి నువ్వులు అద్భుతంగా పనిచేస్తాయి. 


Also read: Soaked Walnuts: వర్షాకాలం వ్యాధులతో జాగ్రత్త, రోజు గుప్పెడు వాల్‌నట్స్ తింటే అన్నింటికీ చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook