Wood Apple Benefits: మారేడు పండుతో శరీరాని ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
Wood Apple Benefits: మారేడు పండును ఆయుర్వేద శాస్త్రంలో ఓ ఔషదంగా భావిస్తారు. పురాతన గ్రంథాల ప్రకారం ఈ పండును దైవిక ఫలంగా పిలుస్తారు. ఇది శరీరానికి, జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీరాని అన్ని రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది.
Wood Apple Benefits: మారేడు పండును ఆయుర్వేద శాస్త్రంలో ఓ ఔషదంగా భావిస్తారు. పురాతన గ్రంథాల ప్రకారం ఈ పండును దైవిక ఫలంగా పిలుస్తారు. ఇది శరీరానికి, జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీరాని అన్ని రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. కనుక ఈ చెట్టును దైవంగా భావిస్తారు.
మారేడు పురాతన పండ్లలో ఒకటి:
మారేడు పండు భారత్‌లోని పురాతన పండ్లలో ఒకటి. ఈ పండు గురించి ఆయుర్వేద గ్రంథాలలో చాలా క్లుప్తంగా వివరించారు. ఇది మొదట హిమాలయాలోని దిగువ ప్రాంతాలలో ఈ చెట్టును గుర్తించారు. ఆ తర్వాత శ్రీలంక, మయన్మార్, వియత్నాం, లావోస్, కంబోడియా, థాయిలాండ్ మొదలైన దేశాలకు ఈ చెట్టు విస్తరించింది. బౌద్ధ పండితులు జువాన్‌జాంగ్ క్రీ.శ. 633లో చైనా నుంచి భారత్‌కు వచ్చినప్పుడు..ఆయన అనేక పుస్తకాలను చైనాకు తీసుకుళ్లాడు. ఆ పుస్తకాలలో మారేడు పండు గురించి అభివర్ణించాడు.
ఈ పండుకు మతపరమైన ప్రాముఖ్యత ఉంది:
ఈ ఆకు గురించి శివపురాణంతో సహా ఇతర గ్రంథాలలో చాలా చక్కగా వివరించారు. మారేడు ఆకులను పరమశివుని ఆరాధనకు, ఆయన అనుగ్రహాం పొందడానికి వినియోగిస్తారని పేర్కొన్నారు.
మత గ్రంథాల ప్రకారం మారేడు చెట్టును శివుని రూపంగా భావిస్తారు.
ఆరోగ్యానికి మేలు చేస్తుంది:
మారేడు పండులో చాలా రకాల విటమిన్లు ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగు పర్చడానికి తోడ్పడుతుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యల నుంచి దూరం చేస్తుంది. అంతేకాకుండా అతిసారం, విరేచనాల నుంచి విముక్తి పొందడాని కూడా ఈ పండ్లను వాడతారు. ఈ పండులో విటమిన్ సి, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, ఐరన్ కూడా అధిక పరిమాణంలో ఉంటాయి. కావున శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
Also Read: Coriander Seeds Water Benefits: కొత్తి మీర గింజలతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలుంటాయో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook