World Lungs Day: ఊపిరితిత్తులు శరీరంలో అత్యంత కీలకమైన అంగాలు. కొన్ని లక్షణాలతో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చు. సెప్టెంబర్ 25 ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం సందర్భంగా లంగ్స్ గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మానవ శరీరంలోని కీలకమైన, ముఖ్యమైన అంగాల్లో ఒకటి ఊపిరితిత్తులు. శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ను ఫిల్టర్ చేసి మొత్తం శరీరానికి పంపించేది ఊపిరితిత్తులే. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ప్రమాదకరమైంది. ఊపిరితిత్తులు పాడైతే..ఆరోగ్య పరిస్థితి చెడిపోతుంది. అందుకే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నాయో లేవో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇవాళ అంటే సెప్టెంబర్ 25 ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం. వరల్డ్ లంగ్స్ డే సందర్భంగా ఊపిరితిత్తుల ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. కొన్నిరకాల లక్షణాలు లంగ్స్ ఆరోగ్య లేదా అనారోగ్య పరిస్థితిని సూచిస్తాయి. ఊపిరితిత్తులు పాడైతే కన్పించే లక్షణాలెలా ఉంటాయి లేదా లంగ్స్‌లో ఇబ్బంది ఉంటే కన్పించే ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయనేది చూద్దాం.


1. తరచూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే మీ ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని అర్ధం. ఈ సమస్య తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. 


2. మెరుగైన ఆరోగ్యం కోసం ఎక్సర్‌సైజ్ అనేది చాలా అవసరం. కొద్దిగా వ్యాయామం చేసినా అలసట వస్తుంటే మీ లంగ్స్‌లో ఇబ్బంది ఉందని అర్ధం.


3. మీ శరీరం నుంచి తరచూ కఫం బయటకు వస్తుంటే..ఊపిరితిత్తులు పాడైన సంకేతమే. అందుకే జ్వరం, జలుబు, కఫం ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు.


4. మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బంది పడుతుంటే ఊపిరితిత్తుల్లో సమస్య ఉందనే అర్ధం. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 


5. ఛాతీలో నొప్పి అనేది గుండె సంబంధిత లక్షణమే కాకుండా లంగ్స్ సమస్యకు సంబంధించిన లక్షణం కూడా.


6. మీ బరువు క్రమంగా తగ్గుతుంటే..వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఊపిరిత్తుల సమస్యలో కేన్సర్ లక్షణం కావచ్చు. 


Also read: Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఇలా జామ ఆకుల టీని తాగండి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook