Set Dosa Recipe: మనం బ్రేక్‌ ఫాస్ట్ కోసం ఇడ్లీ, దోశ, పూరీ ఇలా ఎన్నో వంటలను చేస్తాము. అయితే ప్రస్తుతం హోటల్స్‌లో సెట్‌ దోశలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఇది తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది. తరుచు ఒకేరకం దోశలు కాకుండా ఈ సారి సెట్‌ దోశలను మనం కూడా ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ సెట్‌ దోశ కోసం పెద్ద పెద్ద వస్తువులు అవసరం లేదు. మనం రోజు ఉపయోగించే పదార్థాలు సరిపోతాయి.  సెట్ దోస మరొక వైవిధ్యం మరియు ఎక్కువగా కర్ణాటక రెస్టారెంట్ మెనూలలో కనిపిస్తుంది. కరకరలాడే మందపాటి బేస్, మృదువైన స్పాంజి & మెత్తటి పైభాగం ఒక పోరస్ ఆకృతితో ఈ సెట్ దోసలను సాధారణ స్ఫుటమైన సన్నని దోసెల నుండి చాలా భిన్నంగా చేస్తుంది. ఇది ఎంతో రుచిగా, స్పాంజీలాగా ఉంటుంది. ఈ సెట్ దోశ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెట్ దోశకి కావాల్సిన ప‌దార్థాలు:


మిన‌ప‌ప్పు – అర క‌ప్పు


 బియ్యం – ఒక‌టిన్న‌ర క‌ప్పు


 మెంతులు – ఒక టేబుల్ స్పూన్


 అటుకులు – అర క‌ప్పు


 ఉప్పు 


 నీళ్లు



సెట్ దోశ త‌యారీ విధానం:


గిన్నెలో మిన‌ప‌ప్పు, బియ్యం, మెంతులు, అటుకులు వేసి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వీటిని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత జార్‌లో మిక్సీ పట్టుకుని ఇంకో గిన్నెలోకి తీసుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిలో ఉప్పు, నీళ్లు పోసి క‌లుపుకోవాలి. స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి.  పిండిని తీసుకుని పెనం మీద వేసుకోవాలి. ఈ పిండిని ఊత‌ప్పంలాగా వేసుకోవాలి. అంచుల దగ్గర నూనె వేసుకుని మూత పెట్టాలి.దోశ ఒక‌వైపు ఎర్ర‌గా కాలిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని కొబ్బ‌రి చ‌ట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. 


దీనిని ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సెట్ దోశ‌లు త‌యార‌వుతాయి.  మృదువుగా,  రుచిగా ఉండే ఈ  దోశ‌ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ దోశను తింటే మళ్లీ మళ్లీ కావాలని అడుతుగారు.


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter