TFCC Elections Polling 2023: తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (TFCC) ఎన్నికల పోలింగ్‌ (Film Chamber Elections 2023) కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. ఆరు గంటల తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి రెండేళ్లకోకసారి జరిగే ఎన్నికల్లో ఈసారి అధ్యక్ష స్థానానికి నిర్మాతలు దిల్‌ రాజు, సి.కల్యాణ్‌ పోటీపడుతున్నారు. ఫిల్మ్‌ ఛాంబర్ ఆఫ్‌ కామర్స్‌లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌, స్టూడియో సెక్టార్‌ అనే నాలుగు విభాగాలు ఉన్నాయి. నాలుగు సెక్టార్ల నుంచి సుమారు 1600 మంది సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. తాజా సమాచారం ప్రకారం, కేవలం 900 మంది మాత్రమే ఓటుహక్కు వేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎగ్జిబిటర్స్‌ సెక్టార్‌ నుంచి 16 మంది ఈసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 


Also Read: Sanjay Dutt First look: 'డబుల్ ఇస్మార్ట్‌'లో సంజయ్ దత్.. అంచనాలను పెంచేసిన ఫస్ట్ లుక్..


ఉదయం 11 గంటల వరకు 232 ఓట్లు పోలయ్యాయి. రాఘవేంద్రరావు, శ్యాంప్రసాద్ రెడ్డి, సుప్రియ, పోసాని కృష్ణమురళి, సురేశ్‌బాబు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, బండ్ల గణేశ్‌, జీవిత తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కాసేపు నిలిచిపోయింది. 'ఫిల్మ్‌ ఛాంబర్‌ మనుగడ, భవిష్యత్‌ తరాలకు మంచి సినీ పరిశ్రమను అందిద్దామనే' నినాదంతో దిల్‌ రాజు ప్యానెల్‌.. చిన్న సినిమాల మనుగడ, డిజిటల్‌ సర్వీసు ప్రొవైడర్ల ఛార్జీల తగ్గింపు హామీలతో సి.కల్యాణ్‌ ప్యానెల్‌ పోటీలో నిలిచాయి. 


Also Read: Dil Raju to contest as MP: దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ.. లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook