Glammonn Mrs india 2024: విదేశాల్లో తెలుగు అమ్మాయికి అరుదైన గౌరవం..హేమలతా రెడ్డికి గామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు..
Glammonn Mrs india 2024: విదేశాల్లో తెలుగు అమ్మాయి హేమలతా రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. జెమినీ టీవీ యాంకర్ గా ప్రస్థానం ప్రారంభించిన ఈమె.. ఆ తర్వాత ‘నిన్ను చూస్తూ’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. తాజాగా ఈ యేడాదికి గాను మలేషియాలో నిర్వహించిన గ్లామన్ మిసెస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచింది.
Glammonn Mrs india 2024: తెలుగు అమ్మాయి హేమలతా రెడ్డికి గ్లామన్ మిసెస్ ఇండియా అవార్డు వరించింది. కెరీర్ మొదట్లో టీవీ యాంకర్ గా పనిచేసింది. ఆపై హీరోయిన్ గా ఆడియన్స్ ను అలరించింది. తాజాగా ఈమె మలేషియా దేశంలో నిర్వహించిన గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు పోటీల్లో - బెస్ట్ టాలెంట్ మరియు బెస్ట్ ఫోటోజెనిక్ ఫేస్ సహా పలు కేటగిరిల్లో ఈమె అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు గెలిచిన తర్వాత హేమలత రెడ్డి తన గ్లోరీ కిరీటంతో స్టేజ్ పై క్యాట్ వాక్ చేసి అలరించారు. గ్లామన్ డైరెక్టర్ శ్రీమతి మన్ దువా హేమలతా రెడ్డి అందాల కిరీటం దక్కడంపై తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఆ తర్వాత హేమలత రెడ్డి మన్ దువా మేడమ్‌తో కలిసి అక్కడ స్థానికంగా ఫేమసైన బటుకేశవరా ఆలయాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో వీరు ఈ శనివారం హైదరాబాద్ కు తిరిగి రానున్నారు.
హేమలతా రెడ్డి మలేషియాలో గ్లామన్ మిసెస్ ఇండియా 2024 గా టైటిల్ పొందడంతో ఆమె సన్నిహితులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ గడ్డపై ఒక తెలుగు అమ్మాయి అది మన దేశానికి ప్రాతినిథ్యం వహించడాన్ని గొప్పగా ఫీలవుతున్నారు. అంతేకాదు ఈ అందాల కిరీటంతో హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం మరోసారి వార్తల్లో నిలిచింది.
ఈ అందాల కిరీటం దక్కడం వెనక హేమలతా రెడ్డి ఎన్నో కష్టనష్టాలు ఒర్చుకుంది. ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత ఇది 1 యేడాది పాటు ఆమె సుదీర్ఘ ప్రయాణం చేసింది. అందాల పోటీల్లో గ్రూమర్‌లు ఉన్నారు. వారు ఆమెకు బాగా శిక్షణ ఇచ్చారు. ఆమెలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించారు. తెలుగు ఇండస్ట్రీ నటి కావడంతో అన్ని ప్రయత్నాల్లో ఆమె చేసిన కృషి వలన ఈ సక్సెస్ దక్కిందంటున్నారు. దీని కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె గ్లామన్ మిసెస్ ఇండియా 2024 టైటిల్ విజేతగా నిలిచింది. దీంతో పాటు ఈమెకు రెండు విభాగాల్లో ఉత్తమ ఫోటోజెనిక్ & బెస్ట్ టాలెంట్ విభాగంలో అవార్డు దక్కడంపై పలువురు ఆమెకు ప్రశంసలతో ముంచెత్తున్నారు.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.