Suspicious Fever: యూపీని వణికిస్తున్న వింత జ్వరం.. 32 మంది చిన్నారులు మృతి
Suspicious fever: ఓ వైపు ప్రపంచాన్ని కరోనా బెంబెలేత్తిస్తుంటే...మరోవైపు యూపీలో అంతుచిక్కని వ్యాధి కలవరపెడుతోంది. ఈ వ్యాధి కారణంగా ఆ రాష్ట్రంలో 39మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 32 మంది చిన్నారుల ఉండటం విశేషం.
Lucknow: దేశంలో కరోనా మహమ్మారి మూడో దశపై నిపుణుల హెచ్చరికల ఆందోళన కొనసాగుతున్న తరుణంలో.. ఉత్తర ప్రదేశ్(UP)లో అంతుచిక్కని జ‍్వరం(Mysterious fever) ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడి 39 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో ఏడుగురు వృద్ధులతోపాటు 32 మంది చిన్నారులు ఉండటం మరింత కలవరపెడుతోంది.
ఫిరోజాబాద్‌లో 32 మంది పిల్లలు, ఏడుగురు పెద్దలు మరణించినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) ధృవీకరించారు. జిల్లాలో డెంగ్యూ లాంటి జ్వరం కారణంగా ఈ మరణాలు సంభవించాయని తెలిపారు. బాధిత కుటుంబాలను సందర్శించిన సీఎం యోగి వారికి తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఫిరోజాబాద్(Firozabad)లోని 100 పడకల జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. ఆగస్టు 18న మొదటి కేసు నమోదైందని ముఖ్యమంత్రి చెప్పారు.
Also Read:Dengue: ఓవైపు కరోనా కల్లోలం.. మరోవైపు డెంగ్యూ డేంజర్ బెల్స్..ఏపీలో విపత్కర పరిస్థితులు
పెరుగుతున్న బాధితుల సంఖ్య
ప్రభుత్వా సుపత్రిలో దాదాపు 200మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారని వైద్యులు ప్రకటించారు. 102 డిగ్రీల సెల్సియస్ జ‍్వరంతో బాధితులు బాధపడుతున్నారని, ఈ జ్వరం(Fever) తగ్గడానికి నాలుగు రోజులు పడుతోందన్నారు వెల్లడించారు. గతవారం నుంచి ఇక్కడ విషజ్వరం పీడితుల సంఖ్య పెరుగుతోంది.గత వారం 40 మంది పిల్లలు ఈ వ్యాధితో మరణించారని ఫిరోజాబాద్(Firozabad) ఎమ్మెల్యే మనీష్ అసిజా ఆదివారం ప్రకటించారు.
అయితే ఈ వాదనను యుపీ ఆరోగ్య మంత్రి జై ప్రతాప్ సింగ్ తిరస్కరించారు. థర్డ్ వేవ్ వచ్చేసిందన్న వాదన సరికాదని, భారీ వర్షాలు, నీటి నిల్వ కారణంగా, పిల్లలలో మలేరియా, డెంగ్యూ, అధిక జర్వం లాంటి లక్షణాలు వస్తున్నాయని చెప్పారు. అలాగే తమ ఆరోగ్య బృందం నిర్వహించిన పరీక్షల్లో బాధితులందరికీ కరోనా నెగిటివ్(Corona negative) వచ్చిందని చెప్పారు. మిగిలిన వారి శాంపిల్స్‌ను కూడా లక్నో(Lucknow)లోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించామన్నారు.
మరోవైపు యూపీ(UP)లోని ఫిరోజాబాద్, మధుర, ఆగ్రా తదితర ప్రదేశాలలో చోటచేసుకుంటున్న మరణాలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra) ఆందోళన వ్యక‍్తం చేశారు. తక్షణమే మెరుగైన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook