ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఒక్కరికీ కరోనా (Covid-19Test) నిర్ధార‌ణ‌ పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెల్లడించారు. దేశంలో కరోనా ప‌రిస్థితిపై సోమవారం అమిత్‌షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ అనిల్ బైజాల్‌తోపాటు ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయా పార్టీలు తమ ఎజెండాల‌ను పక్కనపెట్టి క‌రోనా పరీక్షల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: WhatsAppలో మరో అద్భుతమైన ఫీచర్..


కాగా, స‌మావేశం ప్రారంభం కాగానే ఢిల్లీలో క‌రోనా క‌ట్ట‌డి కోసం ఇప్పటి వరకు కేంద్రం, రాష్ట్రం అమ‌లు చేస్తున్న చర్యలను అమిత్‌షా అఖిలపక్షం ముందు పెట్టారు. కరోనా పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడంలో అన్ని పార్టీలూ ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ సంద‌ర్భంగా అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేసింది. అంతేకాకుండా, కరోనా బారినపడ్డ కుటుంబాలకు, కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్న కుటుంబాలకు రూ.10 వేల‌ చొప్పున సహాయం అందించాలని కేంద్రాన్ని కోరింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..