Nashik bus fire: నాసిక్‌లో ఘోర ప్రమాదం... బస్సులో చెలరేగిన మంటలు.. 10 మంది సజీవదహనం..
Nashik Bus Accident: మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి.. 10 మంది సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడ్డారు.
Bus Caught Fire in Nashik: మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో ఓ ప్రైవేట్ బస్సులో మంటలు (bus fire) చెలరేగి 10 మంది సజీవ దహనమవ్వగా.. 38 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
శుక్రవారం రాత్రి ఓ ప్రైవేట్ బస్సు ప్యాసింజర్స్ యవత్మాల్ నుంచి ముంబై వైపు వెళ్తోంది. నాసిక్‌లోని ఔరంగాబాద్ రహదారిపై తెల్లవారుజామున 5.15 గంటల ప్రాంతంలో ట్రక్కును ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులు నిద్రిస్తున్నారు. దీని వల్ల పెద్దఎత్తున ప్రాణ నష్టం సంభవించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు నాసిక్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ అమోల్ తాంబే తెలిపారు.
అంబులెన్స్ సమయానికి రాకపోవడంతో మృతదేహాలను సిటీ బస్సులోనే ఉంచినట్లు సమాచారం. ఘటన అనంతరం ఘటనా స్థలంలో జనం గుమిగూడడంతో అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసు బృందం ఆరా తీస్తోంది. అయితే బస్సులో ఎలా మంటలు చెలరేగాయి అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చేర్పించారు.
Also Read: Bullet Train in India: ఇండియాలో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ రన్ ఎప్పుడో చెప్పేసిన రైల్వే శాఖ మంత్రి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి