First Bullet Train in India: ఇండియాలో బుల్లెట్ ట్రైన్ రాక కోసం ఎదురుచూసే వారి సంఖ్యకు కొదువే లేదు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో బుల్లెట్ ట్రైన్ సర్వీసులు విరివిగా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా మెరుపు వేగంతో దూసుకుపోయే బుల్లెట్ ట్రెయిన్స్‌తో దూర భారాన్ని ఊహించనంతగా తగ్గించే అవకాశం ఉండటంతో భవిష్యత్‌లో భారత్‌లోనూ రైలు ప్రయాణాల్లో బుల్లెట్ ట్రైన్ సర్వీసెస్ కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ కారణంగానే భారతీయులను ఊరిస్తున్న ఫ్యూచర్ ప్రాజెక్టులలో చెప్పుకోదగిన ప్రాజెక్టుల జాబితాలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కూడా ఒకటిగా ఉంది. ప్రస్తుతం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ నిర్మాణ దశలో ఉన్న సంగతి తెలిసిందే.
ఇండియాలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ రన్
ఈ నేపథ్యంలోనే తాజాగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ గురించి కీలక ప్రకటన చేశారు. శుక్రవారం అహ్మెదాబాద్‌లో పర్యటించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. 2026 లో బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ రన్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. ప్రస్తుతానికి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో భాగంగా 92 పిల్లర్లు పూర్తయ్యాయని అన్నారు. బుల్లెట్ ట్రైన్ సేవల కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఒక రైల్వే స్టేషన్‌ని నిర్మించడంతో పాటు మరో 199 రైల్వే స్టేషన్లను వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్లుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోందని తెలిపారు.
వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్లు
199 రైల్వే స్టేషన్లను వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్లుగా మార్చనున్నట్టు ప్రకటించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Railways minister Ashwini Vaishnaw).. ఆ జాబితాలో అహ్మెదాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఒకటిగా ఉందని అన్నారు. అంతేకాకుండా రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులను ప్రోత్సహించడం కోసం రైల్వే స్టేషన్లలో ఎన్నో అధునాతన సౌకర్యాలను అందించేందుకు రైల్వే ప్లాన్ చేస్తోందని రైల్వే శాఖ మంత్రి మీడియాకు తెలిపారు.
Also Read : CNG Prices Hiked: సీఎన్జీ వాహనదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్ బాటలోనే సీఎన్జీ ధరలు పెంపు
Also Read : Ola, Uber, Rapido Autos: మరో మూడు రోజుల్లో ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలు బంద్
Also Read : Airtel 5G Services: ఎయిర్టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ఎనమిది నగరాల్లో 5జీ ప్లస్ సేవలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి