Power Crisis:ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. దేశంలో 1100 రైళ్లు రద్దు!
Power Crisis:సమ్మర్ వెకేషన్ కు ప్లాన్ చేసుకుంటున్నారా.. కుటుంబ సభ్యులతో కలిసి పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీకో బ్యాడ్ న్యూస్. మీరు టూర్ కు ప్లాన్ చేసుకునేముందు ట్రాన్స్ పోర్టుపై ముందే జాగ్రత్తలు తీసుకోండి.. లేదంటే ఇబ్బందులు పడయం ఖాయం..
Power Crisis:సమ్మర్ వెకేషన్ కు ప్లాన్ చేసుకుంటున్నారా.. కుటుంబ సభ్యులతో కలిసి పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీకో బ్యాడ్ న్యూస్. మీరు టూర్ కు ప్లాన్ చేసుకునేముందు ట్రాన్స్ పోర్టుపై ముందే జాగ్రత్తలు తీసుకోండి.. లేదంటే ఇబ్బందులు పడయం ఖాయం.. ఎందుకో తెలుసా .. దేశంలో 11 వందల రైళ్లు రద్దు కాబోతున్నాయి. అవును మీరు చదివింది నిజమే.. దేశంలో మే నెలాఖరు వరకు 11 వందలకు పైగా రైళ్లను రైల్వే శాఖ రద్దు చేయబోతోంది. దేశంలో కరెంట్ కోరత తీవ్రంగా ఉండటమే ఇందుకు కారణం.
దేశం ప్రస్తుతం కరెంట్ సంక్షోభం ఎదుర్కొంటోంది. విద్యుత్ కొరతతో పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాలు కరెంట్ కోతలు తీవ్రంగా ఉన్నాయి. పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించారు. అటు భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రత పెరిగిపోతుండటంతో రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరిగిపోతోంది. మే చివరి నాటికి ఇది మరింతగా పెరగనుంది. మరోవైపు దేశంలో కోల్ కొరత తీవ్రంగా ఉంది. దీంతో డిమాండ్ కు సరిపడా కరెంట్ ఉత్పత్తి కావడం లేదు. పవర్ కోసం రాష్ట్రాలు కేంద్రం వైపు చూస్తున్నాయి. పరిస్థితి దారుణంగా తయారవుతుండటంతో కేంద్ర సర్కార్ రంగంలోకి దిగింది. బొగ్గు రవాణాకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రైల్వే శాఖ పవర్ ప్లాంట్లకు కోల్ ను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంజి.
బొగ్గును తరలించే గూడ్స్ రైళ్లకు లైన్ క్లియర్ చేస్తోంది రైల్వే శాఖ. ఇందుకోసం భారీగా ఎక్స్ ప్రెల్, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. ఈనెల 24వ తేదీ వరకు దేశంలో వివిధన జోన్లకు సంబంధించి మొత్తం 11 వందల రైళ్లు నిలిచిపోనున్నాయి. రైల్వే శాఖ రద్దు చేసిన రైళ్లలో ఐదు వందల ట్రిప్పుల ఎక్స్ ప్రెస్ మెయిల్ రైళ్లు, ఐదు వందల ఎనభై ట్రిప్పుల ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ఇక 2 వందల 40 ప్యాసింజర్ రైళ్లను ఏప్రిల్ 29న రద్దు చేసింది రైల్వే శాఖ. ప్యాసింజర్ రైళ్లను నిలిపివేసి.. నాలుగు వందల బొగ్గు రైళ్లను రన్ చేసింది. దేశంలో మరో నెల రోజుల పాటు విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని కేంద్ర సర్కార్ భావిస్తోంది. అందుకు అనుగుణంగా బొగ్గు సరఫరాకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు 11 వందల ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తుండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగనున్నాయి. రద్దైన రైళ్లకు అనుగుణంగా ప్రయాణాలు పెట్టుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు రైల్వే అధికారులు.
READ ALSO: UPSC 2023: యూపీఎస్సీ 2023 క్యాలెండర్ విడుదల... సివిల్స్ సహా ఇతర పరీక్షల ముఖ్య తేదీలివే...
Twin Murders: జంట హత్యల కేసులో షాకింగ్ విషయాలు... చంపింది ఆమె భర్తే.. 30కి.మీ వెంబడించి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి