Ram temple: భూమి పూజకు 1,11,000 లడ్డూల తయారీ
అయోధ్యలో ఆగస్టు 5న జరగనున్న రామ మందిరం భూమి పూజ ( Ram temple bhoomi puja) వేడుకకు దేవరాహా హన్స్ బాబా సంస్థాన్ ఆధ్వర్యంలోని మణి రామ్ దాస్ చావ్ని ఆలయంలో 1,11,000 లడ్డూల తయారీ ( Laddoos making) జరుగుతోంది.
అయోధ్య: అయోధ్యలో ఆగస్టు 5న జరగనున్న రామ మందిరం భూమి పూజ ( Ram temple bhoomi puja) వేడుకకు దేవరాహా హన్స్ బాబా సంస్థాన్ ఆధ్వర్యంలోని మణి రామ్ దాస్ చావ్ని ఆలయంలో 1,11,000 లడ్డూల తయారీ ( Laddoos making) జరుగుతోంది. చావ్నికి చెందిన పండితులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆగస్టు 5న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భూమి పూజకి హాజరై రాముల వారికి ఈ లడ్డూలను సమర్పించనున్నారు. ఆ తరువాత, పునాది వేసే కార్యక్రమానికి వచ్చే భక్తులందరికీ పంపిణీ చేయనున్నారు. అలాగే మన దేశంలోని అన్ని ప్రధాన దేవాలయాలకు కూడా ఈ లడ్డూలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య, రామ మందిరం చరిత్రను తెలియజేసే మూడు పుస్తకాలు, లడ్డూల బాక్స్, శాలువ వంటివి కలిగి ఉన్న ఒక బ్యాగ్ అతిధులు అందరికి అందజేయనున్నారని చావ్ని పండితుడు ఒకరు ఏఎన్ఐకి తెలిపారు. ( Also read: అప్పటివరకు International flights నిషేధం
గత 4 రోజులుగా లడ్డూల తయారీ జరుగుతోందని, మెగా ఈవెంట్‌కు ముందే అవి ప్యాక్ చేసి రెడీ అవుతాయని చావ్నిలో లడ్డూల తయారీలో పాల్గొంటున్న సిబ్బంది తెలిపారు. ఆగస్టు 5న అయోధ్యలోని రామ మందిరం నిర్మాణం భూమి పూజ వేడుకకి ( Ram mandir bhoomi puja) అనేక రాష్ట్రాల నుంచి అతిథులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం తరువాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం పనులు ప్రారంభం కానున్నాయి. Also read: Twitter hacking: ట్విటర్ హ్యాకింగ్ ఎలా జరిగిందంటే..
సుప్రీంకోర్టు తీర్పు ( Supreme court verdict) ప్రకారం ఏర్పాటు చేసిన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ నెల మొదట్లో రెండవ సమావేశాన్ని నిర్వహించింది. ఈ ఏడాది మార్చిలో రామ లల్లా విగ్రహాన్ని తాత్కాలిక నిర్మాణానికి మార్చారు. రామాలయ నిర్మాణం కోసం అయోధ్యలో ఉన్న స్థలాన్ని అప్పగించాలని సుప్రీం కోర్టు గత ఏడాది నవంబర్ 9న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు మేరకే ప్రస్తుతం రామాలయం నిర్మాణానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. Also read: Bank Holidays: ఆగస్టులో బ్యాంకు సెలవులు ఇవే