Oxygen Shortage: కరోనా వైరస్ దేశవ్యాప్తంగా గజగజవణికిస్తోంది. ప్రతిరోజూ రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి విలయతాండవానికి మరణమృదంగం మోగుతోంది. ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు పోతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ( Coronavirus cases) పంజా విసురుతోంది. కరోనా కోరలు చాచి మృత్యుకౌగిట లాగుతోంది. గత 3-4 రోజుల్నించి రోజుకు 2 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపధ్యంలో పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కారణంగా విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆక్సిజన్ సరఫరా(Oxygen Supply), మందులు లేకపోవడం, వ్యాక్సిన్ కొరత(Vaccine Shortage)తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే ఆక్సిజన్ కొరత కారణంగా పలువురు మరణించారు. మద్యప్రదేశ్( Madhya pradesh)‌లో సైతం పరిస్థితి ఇదే విధంగా మారింది. షాదోల్ జిల్లా కేంద్రంలోని  మెడికల్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత(Oxygen shortage)తో 12 మంది మరణించారు. గత 24 గంటల వ్యవధిలో ఆరుగురు మరణించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పలువురు మృతి చెందినట్టు మృతుల బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు.


అయితే శుక్రవారం రాత్రి నుంచి మొత్తం 22 మంది చనిపోయినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.ఈ సంఘటనపై ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. ఆరుగురు చనిపోయినట్లు అధికారికంగా వెల్లడించారు. ఆ తర్వాత అదనపు కలెక్టర్‌ ఆసుపత్రికి చేరుకోని పరిశీలించారు. మొత్తం 12 మంది మరణించినట్లు వెల్లడించారు. కాగా ఈ ఆరోపణలను ఆసుపత్రి యాజమాన్యం తోసిపుచ్చింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ సహా విపక్షాలన్నీ.. బీజేపీ ప్రభుత్వం ( Bjp government)పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో గత 24 గంటల్లో 11 వేల 269 కరోనా కేసులు నమోదయ్యాయి. 66 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4 వేల 491 మంది మరణించారు. 


Also read: Corona second wave symptoms: కరోనా సెకండ్ వేవ్ కొత్త లక్షణాలేంటి..ఏ దశలో ఏ చికిత్స


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook