Corona second wave symptoms: కరోనా సెకండ్ వేవ్ కొత్త లక్షణాలేంటి..ఏ దశలో ఏ చికిత్స

Corona second wave symptoms: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపద్యంలో అసలు ఈ కరోనా సెకండ్ వేవ్ కొత్త లక్షణాలేంటి..పరీక్షలు ఎప్పుడు చేసుకోవాలి..చికిత్సా విధానాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 18, 2021, 02:53 PM IST
Corona second wave symptoms: కరోనా సెకండ్ వేవ్ కొత్త లక్షణాలేంటి..ఏ దశలో ఏ చికిత్స

Corona second wave symptoms: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపద్యంలో అసలు ఈ కరోనా సెకండ్ వేవ్ కొత్త లక్షణాలేంటి..పరీక్షలు ఎప్పుడు చేసుకోవాలి..చికిత్సా విధానాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో కరోనా వైరస్ (Corona virus) మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. కరోనా సెకండ్ వేవ్ (Corona second wave) కేసులు దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపద్యంలో అసలు ఈ కరోనా సెకండ్ వేవ్ ఏ మేరకు ప్రమాదకరం, కొత్త లక్షణాలేమున్నాయనేది( Corona new symptoms) తెలుసుకోవడం చాలా అవసరం. అదే సమయంలో అసలు పరీక్షలు ఎప్పుడు చేయించుకుంటే మంచిది..చికిత్సా విధానాలేమున్నాయనేది ముఖ్యం. కరోనా నిర్ధారణ పరీక్షలు లక్షణాలున్నప్పుడు చేయించుకోవడమే ఉత్తమమైన మార్గమని వైద్య నిపుణులు అంటున్నారు. 

జ్వరం, ఒళ్లు నొప్పులు, వాసన, రుచి లేకపోవడం, చలి ఉండటం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అనేది ఇప్పటివరకూ తెలిసిన లక్షణాలు. కరోనా సెకండ్ వేవ్‌లో కొత్తగా కొన్ని లక్షణాలు (Corona Additional symptoms) బయటపడుతున్నాయి. కళ్లు గులాబీ లేదా ఎరుపు రంగులో మారడం, విరేచనాలు, తాత్కాలికంగా వినికిడి శక్తి కోల్పోవడం కొత్తగా కన్పించే లక్షణాలుగా ఉన్నాయి. అందుకే పాజిటివ్ రోగితో అత్యంత సమీపంలో ఉన్నప్పుడు గానీ, కలిసి ఓ పదిహేను నిమిషాలున్నప్పుడు గానీ పరీక్ష చేయించుకోవడం మంచిది. 

Also read: COVID-19: కరోనా వైరస్ ఎంత సమయంలో వ్యాపిస్తుందో తెలుసా, నిపుణులు ఏం చెప్పారంటే

ఆర్టీపీసీఆర్ పరీక్ష(RTPCR Test) ఒక్కటే ఇప్పటివరకూ అత్యంత కీలకమైన నిర్ధారణ పరీక్ష. ర్యాపిడ్ యాంటీజెన్ ( Rapid Antigen test) అప్పటికప్పుడు నిర్ధారణ చేసుకునే పరీక్ష. ఇందులో పాజిటివ్ ఉంటే కరోనా వైరస్ ఉన్నట్టే అర్ధం చేసుకోవాలి. ర్యాపిడ్ టెస్ట్ నెగెటివ్ వచ్చి..లక్షణాలుంటే మాత్రం ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవల్సిందే. కరోనా చికిత్సలో భాగంగా అత్యవసరమైతే రెమ్‌‌డెసివిర్ ఇంజక్షన్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇంజక్షన్‌కు మార్కెట్‌లో కొరత ఏర్పడింది. ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చినా..రక్తంలో  ఆక్సిజన్ సంతృప్త శాతం 90 శాతం ఉండి ఆక్సిజన్ అందిస్తున్నప్పుడు ఈ ఇంజక్షన్ ఇస్తారు. ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు కూడా 9 రోజుల్లోనే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ( Remdesivir Injection) ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వైరస్ లోడ్ రెట్టింపయ్యే అవకాశముంది. 

కరోనా మొదటి దశలో హోం క్వారంటైన్‌ లేదా ఐసోలేషన్‌ వార్డులో ఉంచుతారు. కొద్దిగా జ్వరం, బలహీనంగా ఉండటం, కండరాల నొప్పి, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం, తుమ్ములు, వాంతులు, వాంతులు వస్తున్నట్లుగా అనిపించడం, కడుపునొప్పి, విరేచనాలు ఉంటాయి. ఇక రెండవ దశలో ఆక్సిజన్ చికిత్స అందిస్తారు.  ఈ దశలో జ్వరం తగ్గకపోవడం, దగ్గు నిరంతరాయంగా ఉండటం, ఛాతీ ఎక్స్‌రే లేదా సీటీ స్కాన్‌లో ఏదో సమస్యను గుర్తించడం ఉంటుంది. ఇక మూడవ దశ ఐసీయూలో ఉంచడం. ఈ దశలో తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య ఉండి... రక్తంలో ఆక్సిజన్‌ శాతం 92 కంటే  తక్కువగా ఉంటుంది. ఈ దశలో అత్యవసర క్రిటికల్ కేర్ ఉండాలి. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ , బీపీ, గుండె వైఫల్యం, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం , కిడ్నీ సమస్యలు తలెత్తడం ఉంటుంది. 

Also read: Remdesivir Injection prices: రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ధరల్లో భారీ తగ్గుదల, ఏ ఇంజక్షన్ ధర ఎంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News