Corona Updates in India: దేశంలో కరోనా కలవర పెడుతోంది. రోజురోజుకు కోవిడ్ కేసులు రెట్టింపు అవుతున్నాయి. దీంతో ఫోర్త్ వేవ్ వస్తుందా అన్న భయాందోళనలు కల్గుతున్నాయి. నిన్న 8 వేలకు పైగా కేసులు నమోదు కాగా..తాజాగా 12 వేల 213 వెలుగు చూశాయి. కరోనా వల్ల 24 గంటల వ్యవధిలో 11 మంది మృత్యువాతపడ్డారు. ఇటు రికవరీ రేటు కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 7 వేల 624 మంది కరోనా నుంచి కోలుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం దేశంలో 58 వేల 215 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారి పాజిటివిటీ రేటు 2.25 శాతంగా ఉంది. ఈమేరకు భారత వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఆందోళన కల్గిస్తోంది. మహారాష్ట్రలో 4 వేల 24, కేరళలో 3 వేల 488 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో వరుసగా రెండోరోజు 11 వందల కేసులు వెలుగు చూశాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4.32 కోట్ల మంది వైరస్ బారిన పడ్డారు.


మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ఇప్పటివరకు 15 లక్షల 21 వేల 942 మంది డోసు తీసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బూస్టర్ డోస్ పంపిణీ కొనసాగుతోంది. ప్రైవేట్‌ కేంద్రాల్లో టీకాను అందిస్తున్నారు.




Also read: WhatsApp Instant Loan: వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే న్యూస్.. ఈ నెంబర్‌కి ఒక్క మెసేజ్ పెడితే చాలు.. 30 సెకన్లలో లోన్..


Also read:Southwest Monsoon: తెలుగు రాష్ట్రాల్లో ఇక వానలే వానలు..మరింత విస్తరిస్తున్న నైరుతి రాగం..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook