Power Transformer Explodes In Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చమోలి జిల్లాలో బుధవారం మధ్యాహ్నం అలకనంద నది ఒడ్డున ట్రాన్స్‌ఫార్మర్ పేలిన ఘటనలో 15 మంది మృతి చెందారు. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 




ఈ ప్రమాదం గురించి ఎస్పీ చమోలి పరమేంద్ర దోవల్ మాట్లాడుతూ.. ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. 15 మంది మరణించగా.. ఏడుగురు గాయపడ్డారని చెప్పారు. గాయపడిన వారిలో ఇద్దరిని రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు విమానంలో తరలించగా.. మిగిలిన ఐదుగురిని గోపేశ్వర్‌లోని ఆసుపత్రిలో చేర్చినట్లు వెల్లడించారు.


 




ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ పేలి 15 మంది మరణించడం చాలా బాధాకరమైన సంఘటన అని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, రెస్క్యూ బృందాలు ఉన్నాయని.. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు కూడా ఆదేశించామని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు హెలికాప్టర్ల సహాయం తీసుకుంటున్నామన్నారు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన ఆయన ట్వీట్ చేశారు. 


మృతుల్లో పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్, ఐదుగురు హోంగార్డులు ఉన్నారని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వి.మురుగేశన్ వెల్లడించారు. రైలింగ్‌పై కరెంట్‌ ఉందని ప్రాథమిక విచారణలో తేలిందని.. తదుపరి విచారణలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. చమోలిలో నమామి గంగే ప్రాజెక్ట్ కింద నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ట్రాన్స్‌ఫార్మర్ పేలినట్లు తెలుస్తోంది. 


Also Read: Ongole Attack Video: ఒంగోలులో దారుణం.. యువకుడి నోట్లో మూత్రం పోసిన దుండగులు  


Also Read: Viral Video: జేసీబీపై దూసుకువచ్చిన భారీ బండరాళ్లు.. క్షణాల్లో తప్పించుకున్న డ్రైవర్.. వీడియో వైరల్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


   TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి