Covid 19: ఒకే స్కూల్లో 18 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్...
18 students test covid 19 positive in Mumbai: ఆ స్కూల్లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి తండ్రి ఒకరు ఇటీవల ఖతార్ నుంచి ముంబై వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అతనికి కోవిడ్ నెగటివ్‌గా తేలినప్పటికీ... అతని కొడుక్కి మాత్రం పాజిటివ్‌గా నిర్దారణ అయింది.
18 students test covid 19 positive in Mumbai: మహారాష్ట్ర నేవీ ముంబైలోని ఘన్సోలీ ప్రాంతంలో ఉన్న షెట్కారీ శిక్షణ సంస్థ స్కూల్లో ఒకేసారి 18 మంది విద్యార్థులు కోవిడ్ బారినపడ్డారు. వీరంతా 8 నుంచి 11వ తరగతికి చెందిన విద్యార్థులని నేవీ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (NMMC) వెల్లడించింది. ప్రస్తుతం ఆ 18 మందికి స్థానిక కోవిడ్ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది.
ఆ స్కూల్లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి తండ్రి ఒకరు ఇటీవల ఖతార్ (Qatar) నుంచి ముంబై (Mumbai) వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అతనికి కోవిడ్ నెగటివ్‌గా తేలినప్పటికీ... అతని కొడుక్కి మాత్రం పాజిటివ్‌గా నిర్దారణ అయింది. అతని ద్వారానే మిగతా విద్యార్థులకు వైరస్ వ్యాప్తి చెందవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకూ స్కూల్లోని 950 మంది విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు చేసినట్లు యాజమాన్యం వెల్లడించింది. వచ్చే వారం రోజుల పాటు స్కూల్‌ను మూసివేస్తున్నట్లు తెలిపింది.
మహారాష్ట్రలో ఒమిక్రాన్ (Omicron) కేసులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ఒకేసారి 16 మంది విద్యార్థులు కరోనా బారినపడటం ఆందోళన రేకెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ దాదాపు 100 ఒమిక్రాన్ కేసులు నమోదవగా ఇందులో 40 కేసులు మహారాష్ట్రలోనే (Maharashtra) నమోదయ్యాయి. వీరిలో మూడేళ్ల బాలుడు, 18 నెలల శిశువు ఉండటం గమనార్హం. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7145 కోవిడ్ కేసులు నమోదవగా... మొత్తం కేసుల సంఖ్య 34,73,194కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 84,565గా ఉంది.
Also Read: Hyderabad: సినిమా ప్రదర్శన 15ని. ఆలస్యం-ఆ మల్టీప్లెక్స్‌కు రూ.1లక్ష జరిమానా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook