18 Year Old Nabarangpur Girl Assaulted Groped Forcibly Married Off victim wants justice: తనపై అమానుషంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ యువతి రాయిఘర్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒడిశాలోని నవరంగపూర్‌ (Nabarangpur) జిల్లాలోని రాయిఘర్‌ సమితి, సోనపూర్‌ (Sonapur) గ్రామంలో తన అక్క ఇంటికి వెళ్లింది ఒక యువతి. ఛడిబెడ గ్రామానికి చెందిన ఆ యువతి ఈ నెల 8న తన అక్క ఇంటికి వెళ్లింది. గ్రామంలో కాళీమాత (Kalimata) పూజలుండడంతో అదేరోజు రాత్రి అక్కడ జరిగి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనింది.


అయితే అక్కడికి వచ్చిన తన ప్రియుడితో మాట్లాడేందుకు కార్యక్రమం జరుగుతున్న ప్రాంతం నుంచి పక్కకు వెళ్లింది. తన ప్రియుడితో (Boyfriend) కూర్చొని ఆమె మాట్లాడుతూ ఉండగా.. ఆ గ్రామానికి చెందిన కొందరు ఆకతాయిలు వచ్చారు. వారిని చుట్టుముట్టారు. వారి వివరాలను అడిగారు.


Also Read : Drug seizure : హైదరాబాద్‌లో రూ.5.50 కోట్ల డ్రగ్స్ పట్టివేత


తర్వాత ఆ ప్రేమికులిద్దరినీ బలవంతంగా లాక్కెళ్లారు. వారిద్దరినీ ఒక ఇంట్లో బంధించి వీడియో (video) తీశారు. వారి ఇద్దరిపై పూలు చల్లి.. పెళ్లి చేసినట్లుగా మరొక వీడియో కూడా తీశారు. తర్వాత ఆ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆ యువతి (Young woman) తనను విడిచిపెట్టాలని ఎంత వేడుకున్నా వినలేదు.


విషయం తెలుసుకున్న యువతి తండ్రి సోనపూర్‌కి వెళ్లాడు. యువతిని తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తే.. గ్రామ కమిటీ సభ్యులు యువతి తండ్రిపై భౌతికదాడి చేశారని యువతి ఫిర్యాదులో (Complaint) పేర్కొంది. అలాగే తనను బంధించి, చిత్రహింసలు చేసిన వీడియోలు వైరల్‌ (Videos go viral‌) అవుతున్నాయని బాధపడింది. తమకు న్యాయం చేయాలని పోలీసులను (police)కోరింది.
Also Read :Viral Video: రంగు రంగు చేపల మధ్య కూర్చొని భోంచేస్తే..?? పదండి అదెక్కడో చూద్దాం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook