Gold Smuggling: ఆధునిక పరిజ్ఞానం ఎంతగా పెరుగుతున్నా సరే..గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం తగ్గడం లేదు. రాను రానూ కొత్త కొత్త ఐడియాలతో అధికారులకు చిక్కకుండా బంగారాన్ని తరలిస్తూనే ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కస్టమ్స్ అధికార్లకు ( Customs Officers ) గోల్డ్ స్మగ్లింగ్ ( Gold Smuggling ) అతి పెద్ద తలనొప్పిగా మారింది. ఎయిర్‌పోర్ట్ వద్ద ఎంత అధునాతనమైన పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నా సరే..స్మగ్లర్లు మాత్రం అంతకంటే ఎక్కువ తెలివితేటలతో కొత్త కొత్త పద్ధతుల్లో బంగారాన్ని విదేశాల నుంచి తరలిస్తూనే ఉన్నారు. ఎయిర్‌పోర్ట్ ( Airport ) కాని ప్రాంతాల్లో అయితే విచ్చలవిడిగా సాగుతోంది.  చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఇటీవలే ఓ వ్యక్తి తన చెప్పుల్లో బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికార్లకు పట్టబడ్డాడు. ఇప్పుడు తాజాగా భారీగా బంగారం, నగదు నిల్వలు బయటపడ్డాయి. 


చెన్నై ఎయిర్‌పోర్ట్ ( Chennai Airport ) ‌లో మూడు వేర్వేరు ఘటనల్లో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. మొత్తం మూడు ఘటనల్లో 2.42 కిలోల బంగారం, 1.35 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనమైంది. దుబాయ్ నుంచి చెన్నైకు వచ్చి ఫ్లైట్ నెంబర్ IX-1644లో ఏడుగురు ప్రయాణికుల్నించి పెద్ద మొత్తంలో బంగారం, నగదు స్వాధీనమైంది. కస్టమ్స్ అధికారులు కేవలం అనుమానంతో సోదా చేసినప్పుడు ఇదంతా బయటపడింది.


Also read: Rape: పార్టీకి పిలిచి..స్నేహితుడి భార్యపై అత్యాచారం చేసిన మిలట్రీ కల్నల్ 


ఏడుగురు వ్యక్తుల్ని తనిఖీ చేసినప్పుడు 56 లక్షల విలువ కలిగిన 1.10 కిలోల బరువున్న 12 గోల్డ్ చైన్స్, 5 గోల్డ్ కాయిన్స్, 2 గోల్డ్ ప్లేట్స్ స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. గోల్డ్ చైన్స్‌ను హ్యాండ్ బ్యాగ్స్, మొబైల్ కవర్స్‌లో దాచిపెట్టి స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుబడ్డారు.  


దుబాయ్ ( Dubai )ఫ్లైట్ FZ 8517 నుంచి దిగిన 8 మంది ప్రయాణీకుల్నించి 17 గోల్డ్ కట్ బిస్కట్స్, 10 గోల్డ్ ఛైన్స్, 67 లక్షల విలువైన 1.32 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్  IX 1643 లో విదేశీ కరెన్సీ తీసుకెళ్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని తనిఖీ చేయగా..12 లక్షల విలువైన సౌదీ కరెన్సీ పట్టుబడింది. Also read: RTGS Services: ఇకపై 24 గంటలు ఆర్టీజీఎస్ సదుపాయం