Rape: పార్టీకి పిలిచి..స్నేహితుడి భార్యపై అత్యాచారం చేసిన మిలట్రీ కల్నల్

ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో ఘోరం జరిగింది. దేశ రక్షణ చేసే కల్నల్..స్నేహితుడి భార్యపై అత్యాచారం చేశాడు. కాన్పూర్ కంటోన్మెంట్ పోలీసులు కల్నల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇండియన్ ఆర్మీలో ఇప్పుడీ సంఘటన కలవరం రేపుతోంది.

Last Updated : Dec 14, 2020, 12:43 PM IST
Rape: పార్టీకి పిలిచి..స్నేహితుడి భార్యపై అత్యాచారం చేసిన మిలట్రీ కల్నల్

ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో ఘోరం జరిగింది. దేశ రక్షణ చేసే కల్నల్..స్నేహితుడి భార్యపై అత్యాచారం చేశాడు. కాన్పూర్ కంటోన్మెంట్ పోలీసులు కల్నల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇండియన్ ఆర్మీలో ఇప్పుడీ సంఘటన కలవరం రేపుతోంది. 

ఉత్తరప్రదేశ్ ( Uthar pradesh ) కాన్పూర్ ( Kanpur )లో సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. ఇండియన్ ఆర్మీ పరువును బజారుకీడ్చిన ఓ ప్రబుద్ధుడి వ్యవహారమిది. కాన్పూర్ కంటోన్మెంట్ పోలిస్ స్టేషన్ ( Kanpur Cantonment police station)లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం..ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ ( Leutenant colonel ) గా పనిచేస్తున్న ఓ అధికారికి ఇటీవలే కల్నల్ ( Colonel )గా ప్రొమోషన్ లభించింది. దాంతో కాన్పూర్ లోని ఆఫీసర్స్ మెస్ లో పార్టీ ఏర్పాటు చేశాడు. తన స్నేహితుడిని పార్టీకి  పిలిచాడు. అతను రష్యన్ మహిళను పెళ్లి చేసుకుని గత పదేళ్లుగా ఇండియాలోనే ఉంటున్నాడు. భార్యతో సహా ఆహ్వానిస్తే పార్టీకు వెళ్లాడు. డిసెంబర్ 12 రాత్రి జరిగిన పార్టీలో స్నేహితుడి డ్రింక్ లో మత్తు పదార్ధం కలిపిచ్చాడు. స్నేహితుడు మత్తులో జారుకున్న తరువాత..అతని భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

బాధితుడి ఫిర్యాదు మేరకు కాన్పూర్ కంటోన్మెంట్ పోలీసులు కల్నల్ ( Colonel ) పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన భార్య ప్రతిఘటించినప్పటికీ ఆమెపై దాడి చేసి మరీ అత్యాచారానికి పాల్పడినట్లు బాధితుడు వెల్లడించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ రాజ్‌కుమార్ అగర్వాల్ తెలిపారు. నిందితుడైన కల్నల్ ను పట్టుకునేందుకు  ప్రత్యేక పోలీసు బృందాల్ని రంగంలో దింపారు.  Also read: Kamal Haasan: కొత్త పార్లమెంట్ అవసరమా అని ప్రధాని మోదీని ప్రశ్నించిన కమల్ హాసన్

Trending News