RTGS Services: ఇకపై 24 గంటలు ఆర్టీజీఎస్ సదుపాయం

RTGS Services: బ్యాంక్ కస్టమర్లకు నిజంగా శుభవార్త. పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేయాలనుకునేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. ఆర్బీఐ గవర్నర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

Last Updated : Dec 14, 2020, 10:29 PM IST
  • ఆర్టీజీఎస్ సేవల్ని 24 గంటలు అందుబాటులో తెస్తూ ఆర్బీఐ నిర్ణయం
  • గతంలో బ్యాంకింగ్ వేళల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకూ మాత్రమే అందుబాటులో..
  • ఇప్పటికే నెఫ్ట్ సేవలు 24 గంటలు అందుబాటులో
RTGS Services: ఇకపై 24 గంటలు ఆర్టీజీఎస్ సదుపాయం

RTGS Services: బ్యాంక్ కస్టమర్లకు నిజంగా శుభవార్త. పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేయాలనుకునేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. ఆర్బీఐ గవర్నర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఆన్‌లైన్ నగదు బదిలీ ( Online fund transfer ) కోసం విరివిగా ఉపయోగించేది ఆర్టీజీఎస్ ( RTGS ). రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ పద్దతి. పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ చేసేవారికి గుడ్‌న్యూస్.  డిసెంబర్ 14 నుంచి ఇకపై బ్యాంకులు ఆ సేవల్ని ప్రారంభిస్తున్నాయి. ఆర్టీజీఎస్ సేవల్ని ఇక నుంచి 24 గంటలు అందుబాటులో తీసుకొచ్చింది. ఈ సేవల్ని సాధ్యం చేసిన ఆర్బీఐ, ఐఎఫ్, టీఏఎస్, ఇతర సర్వీసు భాగస్వాములకు అభినందనలంటూ సాక్షాత్తూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ( RBI Governor Shaktikanta das )ట్వీట్ చేశారు.  

పెద్దమొత్తంలో డబ్బు లావాదేవీలు జరపాలంటే ఆర్టీజీఎస్ అత్యుత్తమ విధానం. ఆర్టీజీఎస్ బదిలీకు కనీసం 2 లక్షల్నించి ఉండి..ఆ పైన ఎంతైనా ఉండవచ్చు. గరిష్ట మొత్తం ఎంతనేది పరిమితి లేదు. ఇవాళ్టి వరకూ ఆర్టీజీఎస్ సేవలు బ్యాంకింగ్ పని దినాల్లో ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే అందుబాటులో ఉండేవి. వాస్తవానికి 2 లక్షల లోపు లావాదేవీల కోసం ఉపయోగించే నెఫ్ట్ ( NEFT ) అంటే నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ విధానాన్ని ఏడాది క్రితమే 24 గంటలు అందుబాటులో తెచ్చింది. ఇక ఆర్టీజీఎస్ విధానం కూడా 24 గంటలు అందుబాటులో రానుంది.  

ఆర్టీజీఎస్ సేవల్ని 24 గంటలు ( RTGS 24 hours services ) అందుబాటులో తీసుకురావడంతో వ్యాపారులకు ఎక్కువగా ప్రయోజనం కలగనుంది. మరీ ముఖ్యంగా ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు చాలా ఉపయోగపడనుందని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. Also read: Rape: పార్టీకి పిలిచి..స్నేహితుడి భార్యపై అత్యాచారం చేసిన మిలట్రీ కల్నల్

Trending News