షోఫియాన్ ఎన్కౌంటర్: ఇద్దరు మిలిటెంట్లతో సహా నలుగురు మృతి
జమ్మూకాశ్మీర్‌లోని షోఫియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు లష్కర్-ఇ-తోయిబా మిలిటెంట్లు మరణించారు.
జమ్మూకాశ్మీర్‌లోని షోఫియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు లష్కర్-ఇ-తోయిబా మిలిటెంట్లు మరణించారు. వీరితో పాటు మరో నలుగురు కూడా చనిపోయారని పోలీసులు వెల్లడించారు. పోహన్ సమీపంలో భద్రతాదళాలు ఒక కారును ఆపేందుకు ప్రయత్నించగా.. కారులో ఉన్న వ్యక్తులు వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లడంతో భద్రతాదళాలు వారిపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు కూడా కాల్పులు జరిపారని, ఈ ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు చనిపోయారని తెలిపారు.
కాగా, జమ్మూకాశ్మీర్‌లోని షోఫియాన్‌లో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు లష్కర్ ఇ తోయిబా ఉగ్రవాదులు మృతి చెందినట్లు జమ్మూకాశ్మీర్ రాష్ట్ర డిజీపీ ఎస్‌పి వేద్ మీడియాకు చెప్పారు. ఎదురు కాల్పులు జరిగిన ప్రదేశంలో మరొక నాలుగు మృతదేహాలు కూడా లభ్యమయ్యాయన్నారు. మరణించిన చెందిన ఉగ్రవాదులనుంచి రెండు తుపాకులు, మందుగుండు స్వాధీనం చేసుకున్నట్లు అన్నారు.